‘అఖిల్ 4’ కు ముహూర్తం ఫిక్సయ్యింది…?

అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అయిన అఖిల్ పై అక్కినేని అభిమానులు చాలా అసలు పెట్టుకున్నారు. ఏదేమైనా మా అక్కినేని ఫ్యామిలీలో కూడా ఓ మాస్ హీరో ఉన్నాడు’… అని కాలెరెగరేసుకుని చెప్పుకోవాలని చాలా అసలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలన్నీ నీరుగారిపోయాయనే చెప్పాలి. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘అఖిల్’ చిత్రం ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. అయితేనేం… డాన్సులు,ఫైట్లు ఇరక్కొట్టేసాడు కదా… 2 సినిమాలో అఖిల్ సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తాడని అందరూ అనుకున్నారు. నాగార్జున సైతం అఖిల్ ను రీలాంచ్ చేస్తున్నాని ‘హలో’ చిత్రం రూపొందిస్తే అది కూడా డిజాస్టర్ అయ్యింది. పోనీ అఖిల్ కు హిట్టయినా వస్తే చాలు అనుకుని చేసిన ‘మిస్టర్ మజ్ను’ పరిస్థితి మరీ ఘోరం. ఈ క్రమంలో అఖిల్ కు ఓ హిట్టివ్వడానికి అల్లు అరవింద్ రంగంలోకి దిగాడు.

అవును ‘అఖిల్ 4’ ఫిక్సయ్యింది. గత కొంతకాలంగా అఖిల్ నాలుగవ చిత్రాన్ని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్ట్ చేస్తాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలు నిజం కానున్నాయని తాజా సమాచారం. ‘గీతా ఆర్ట్స్’ నిర్మాణంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కైరా అద్వానీ నటించనుంది. కథ ప్రకారం మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉండడంతో ఓ కొత్త హీరోయిన్ ను తీసుకోబోతున్నారట. ఈ నెలాఖరున ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. మే 2 వ వారం రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి అక్టోబర్ లేదా డిసెంబర్ న విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రంతో అయినా అఖిల్.. అక్కినే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus