Allu Studio: అల్లు స్టూడియో ఇనాగరేషన్ డేట్ ఫిక్స్.. ఆ రోజే ప్రారంభోత్సవం!

అల్లు రామలింగయ్య వారసులుగా అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్స్ స్థాపించి గత ఐదు దశాబ్దాల నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇలా గీత ఆర్ట్స్ లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా అల్లుఅరవింద్ వారసులుగా ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ వచ్చారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని హీరోగా దూసుకుపోతున్నారు. ఇకపోతే నిర్మాణరంగంలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు కుటుంబం అల్లు స్టూడియోస్ అంటూ స్టూడియో నిర్మాణం చేపడుతున్న సంగతి మనకు తెలిసిందే.

హైదరాబాద్ శివారులోని గండిపేట ప్రాంతం దగ్గరలో 10 ఎకరాలను ఎప్పుడో కొనుగోలు చేసి ఉన్న ఈ స్థలంలో 100 కోట్లు కేటాయించి అల్లు స్టూడియో నిర్మాణాన్ని చేపట్టారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ స్టూడియో నిర్మాణం పూర్తయినట్టు సమాచారం. ఇక అల్లు స్టూడియో నిర్మాణం పూర్తి కావడంతో ఈ స్టూడియోని అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అక్టోబర్ ఒకటవ తేదీ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ స్టూడియో నిర్మాణంలో అల్లు బ్రదర్స్ ముగ్గురు పార్ట్నర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపై అల్లు స్టూడియోలోనే ఆహా కార్యక్రమాలకు సంబంధించిన షూటింగ్స్ జరగబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ స్టూడియోలో ఇతర సినిమా షూటింగులు కూడా జరగబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అల్లు కుటుంబం సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకొని అల్లు కుటుంబం ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ నేడు స్టూడియో కూడా నిర్మించారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ఈయన త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీకానున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus