Drushyam 2: ‘దృశ్యం2′ రిలీజ్ డేట్ కూడా ఫిక్సయిందట..!

విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ ను… తెలుగులో ‘నారప్ప’ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అంటే జూలై 20న ఈ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటిటి ప్లాట్ ఫామ్లో రిలీజ్ అయ్యింది.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి రోజు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినా.. మంచి వ్యూయర్ షిప్ నే నమోదు చేసిందని వినికిడి. ఓటిటిలో కూడా వెంకటేష్ సక్సెస్ సాధించాడని చెప్పొచ్చు.

ఇక వెంకీ నటించిన మరో చిత్రం ‘దృశ్యం 2’ కూడా ఓటిటిలోనే విడుదల కాబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం2′ కి ఇది రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ ను తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగు రీమేక్ ను కూడా తెరకెక్కించడం విశేషం.’దృశ్యం’ మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్ పై ప్రేక్షకులకి మంచి అంచనాలే నెలకొన్నాయి.

డిస్ని ప్లస్ హాట్ స్టార్ వారు భారీ మొత్తం చెల్లించి ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ‘వినాయక చవితి’ కానుకగా సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు తాజా సమాచారం.సెప్టెంబర్ 10న(శుక్రవారం) వినాయక చవితి సెలవు ఉండడం.. అటు తర్వాత శని,ఆది వారాలు కూడా సెలవులు కావడంతో ఈ చిత్రాన్ని ఎక్కువ మంది వీక్షించే అవకాశం ఉందని నిర్మాత సురేష్ బాబు భావిస్తున్నారు. అయితే దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus