సర్కారు వారి పాట మొదలయ్యేది అప్పుడే

మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఆయన కొత్త మూవీ సర్కారు వారి పాట టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో వారు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక మూవీ కథపై వస్తున్న వార్తల నేపథ్యంలో దర్శకుడు పరుశురాం ఈ చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కించనున్నాడని వారు ఓ అంచనాకు వచ్చారు. మొన్నటి వరకు పరుశురాం మహేష్ లాంటి స్టార్ ని డీల్ చేయగలడా అనే సందేహంతో ఇబ్బందిపడ్డ వారికి ఆయన పై విశ్వాసం వచ్చింది. ఇక ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందా? ఎప్పుడు థియేటర్స్ లోకి దిగుతుందా? అనే అతృతతో వారున్నారు.

ఈ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారట . దీనితో మహేష్ సర్కారు వారి పాట మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుకానుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుంది. షూటింగ్స్ కి అనుమతి ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో షూటింగ్ నిర్వహించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చాక షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారట.

ఇక ఈ చిత్రం కోసం హీరోయిన్ ని బాలీవుడ్ నుండి తీసుకురావాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన. కియారా అద్వానీ లేదా సాయి మంజ్రేకర్ వంటి పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో మహేష్ మనీ లెండర్ గా కనిపిస్తాడని గట్టిగా వినిపిస్తుంది. చూద్దాం డైరెక్టర్ పరుశురాం మహేష్ ని ఎలా ప్రెజెంట్ చేయనున్నాడో.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus