Pawan kalyan, Rana: భీమ్లా నాయక్ అప్డేట్ వచ్చేసింది.. మరో రెండు రోజుల్లో మాస్ రచ్చ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్లో మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగులోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు సమకూరుస్తున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో మరోసారి పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ పాత్రలో కనిపించబోతున్నట్టు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు.

2022 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు కూడా వారు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇచ్చారు దర్శకనిర్మాతలు. ‘ప్రొడక్షన్ నెంబర్ 12’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ మరియు గ్లిమ్ప్స్ ను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్ట్ 15న ఉదయం 9: 45 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు.. పవన్ కళ్యాణ్ లుంగీలో ఉన్న ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు దర్శకనిర్మాతలు.

దీంతో మరో రెండు రోజుల్లో మాస్ రచ్చ ఖాయమని పవన్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక ఈ చిత్రానికి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను సమకూరుస్తున్నట్టు సంగీత దర్శకుడు తమన్ కూడా హామీ ఇస్తున్నాడు. ‘ఓ పోలీస్ ఆఫీసర్ మరియు ఓ ఎక్స్ మిలిటరీ మెన్ కు మధ్య జరిగే ఇగో క్లాష్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది’. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ గా కనిపించబోతున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus