Mukku Avinash: ఖరీదైన కారును కొన్న అవినాష్… ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

ముక్కు అవినాష్ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి అవినాష్ స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి వరుస బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా అవినాష్ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా అవినాష్ వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉండడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు.

ఈయన అనూజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం (Mukku Avinash) అవినాష్ భార్య నాలుగు నెలల గర్భిణీ కావడంతో ఈయన మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమయంలోనే తన తల్లి గుండెపోటుకు గురి కావడంతో వైద్యులు స్టంట్ వేశారు అంటూ గత రెండు రోజుల క్రితం ఈయన ఒక వీడియోని షేర్ చేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. తాజాగా అవినాష్ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ కారుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇలా ఈ ఫోటోలు వైరల్ కావడంతో పలువురు ఈయన పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తల్లికి బాగాలేదని హాస్పిటల్ బెడ్ పై ఉన్న తల్లిని చూసి ఏడ్చావు అప్పుడే కొత్త కారు కొన్నావు అంటూ భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే అవినాష్ కొనుగోలు చేసిన కారు ఏంటి ఆ కారు ధర ఎంత అనే విషయానికొస్తే ఈయన మహేంద్ర ఎక్స్ యువి 700 కారును కొనుగోలు చేశారని తెలుస్తుంది.

ఈ కారు ఖరీదు సుమారు 25 లక్షల వరకు ఉంటుందని సమాచారం.ఇక తన పాత కారు ప్రమాదానికి గురై పాడవడంతో దానిని ఎక్స్చేంజ్ చేసి ఈ కారును కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఏది ఏమైనా అవినాష్ కారు కొనుగోలు చేయడంతో కొందరు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేయగా మరి కొందరు మాత్రం విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus