Guppedantha Manasu September 16th: సడన్ ఎంట్రీ ఇచ్చిన మురుగన్… షాక్ అయిన శైలేంద్ర!

  • September 16, 2023 / 01:05 PM IST

బుల్లితెరపై ప్రసారమవుతు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేడు ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… ఇచ్చిన సమయం అయిపోతుంది డబ్బు చెల్లించాలి లేదా కాలేజ్ వదులుకోవాలి అంటూ ఎమ్మెస్సార్ గొడవ చేస్తూ ఉంటాడు దాంతో ఫణీంద్ర అక్కడి నుంచి బయటకు వెళ్లిపోగా ఆయన వెనకే మహేంద్ర కూడా వెళ్తాడు. బాధపడకండి అన్నయ్య అంటూ మహేంద్ర అనడంతో బాధపడకుండా ఎలాగ ఉండాలి మహేంద్ర మీరు రిషి వద్దకు వెళ్లారు. రిషి వస్తే ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది అంటూ ఫణింద్ర చెప్పగా రిషి రాడు అన్నయ్య అంటూ మహేంద్ర మాట్లాడుతాడు రాకపోవడం ఏంటి మహేంద్ర అంటూ ఫణింద్ర అడుగుతారు.

మరోవైపు డివిఎస్టి కాలేజ్ వేరే వారి చేతుల్లోకి వెళ్లిపోతుందని స్టూడెంట్స్ అందరూ ఒక చోట చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోపు వసుదారా రిషికి ఫోన్ చేసి సర్ ఇక్కడ కాలేజీ చేయి దాటిపోయి పరిస్థితిలో ఉంది అంటూ వసుధార చెప్పగా నేను బిజీగా ఉన్నాను మేడం అంటూ కాల్ కట్ చేస్తారు. కాలేజీ పెద్ద సమస్యల్లో ఉంది అంటూ మెసేజ్ చేయగా నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ రిప్లై ఇస్తాడు. మరోవైపు శైలేంద్ర దేవయాని ఎమ్మెస్సార్ ముగ్గురు ఒకే చోట చేరి ప్లాన్ అదిరిపోయింది శైలేంద్ర ఈసారి కాలేజ్ నీ చేతుల్లోకి రాకుండా ఎవరు ఆపలేరు అంటూ దేవయాని సంతోషపడుతుంది.

ఇలాగే కంటిన్యూ చెయ్ అంటూ ఎమ్మెస్సార్ కు చెప్పడంతో చూస్తారుగా నా పర్ఫామెన్స్ అంటూ ఎంఎస్ఆర్ మాట్లాడుతారు. మరోవైపు మినిస్టర్ కోసం జగతి కాల్ ఫ్రై చేస్తూనే ఉంటుంది అయితే ఆయన వారం రోజులపాటు టూర్ లో ఉండటంతో కాల్ కలవకపోవడంతో జగతి ఎంతో దిగాలు వ్యక్తం చేస్తుంది. డీబీఎస్టీ కాలేజీలోని అందరి భవిష్యత్తు మీ మీదే ఆధారపడి ఉంది. కాల్ లిఫ్ట్ చేయండి సార్ అని రిషికి మెసేజ్ చేస్తుంది వసుధార. కానీ, అది చూసి రిషి రిప్లై ఇవ్వడు. రిషి స్థాపించిన సామ్రాజ్యం కూలిపోవడాన్ని ఆపలేకపోయామని మహేంద్రతో జగతి చెప్పగా రిషి వస్తారని నాకెందుకో నమ్మకంగా ఉంది అంటూ జగతి మాట్లాడుతుంది.

ఇక వసుధార రిషికి ఫోన్ చేసి ఎమ్మెస్సార్ మీ కాలేజీ లాక్కోవాలని చూస్తున్నారని చెప్పగా మీరు నన్ను చంపేశారు నాకు ఏం జరిగినా సంబంధం లేదు అంటూ రిషి మొండిగా మాట్లాడుతూ ఫోన్ పెట్టేస్తారు. మరోవైపు ఇచ్చిన గడువు అయిపోవడంతో కాన్ఫరెన్స్ హాల్లో ఎమ్మెస్సార్ జగతి సంతకం పెట్టి కాలేజ్ నాకు అప్ప చెప్పాలి అని అనడంతో మా ఇంటిని రాసిస్తాం కాలేజ్ ని వదిలేయ్ అంటూ ఫణింద్ర చెబుతాడు అయినప్పటికీ ఎంఎస్ఆర్ వదలడు ఇక దేవయాని నగలు తాకట్టు పెట్టేద్దామని చెప్పగా ఇప్పుడు అంత టైం లేదు పైగా నగలు తాకట్టు పెడితే అంత డబ్బు కూడా రాదు అంటూ ఫణింద్ర చెబుతాడు.

జగతి వల్లే ఇలా కాలేజ్ మొత్తం తన చేతుల్లోకి వెళ్లిపోతుందని దేవయాని శైలేంద్ర మరో నాటకం ఆడుతారు. అప్పుడే కాలేజీ బాధ్యతలు నేను తీసుకుంటాను అంటే మీ చేతకాదు అని పిన్ని నన్ను అవమానించారు. ఇప్పుడు పిన్ని కారణంగానే కాలేజ్ చేజారిపోతుంది అంటూ మాట్లాడుతారు. ఇక జగతి సంతకం పెట్టబోతూ ఉండగా ఆ సమయంలో దేవయాని శైలేంద్ర సంతోష పడుతూ ఉంటారు. జగతి సంతకం పెట్టేలోపు ఉన్నఫలంగా అక్కడికి పాండియన్ తన తండ్రి మురుగన్ తో పాటు కూడా ఎంట్రీ ఇస్తారు. వారిని చూసిన శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇతను రిషి స్టూడెంట్ మరి ఇతను ఎవరు అని మనసులో అనుకుంటారు.

ఎవరు అని శైలేంద్ర అడగడంతో కేరళ నుంచి మీకోసం కొబ్బరి బోండా పట్టుకొని వచ్చాను అంటూ మాట్లాడుతారు అసలు మీకేం కావాలి అని అడగడంతో నాకేమీ అవసరం లేదు డబ్బు కోసం ఇక్కడ ఎవరో గుంట నక్కల కాపు కాచుకొని ఉన్నారట కదా మీకు డబ్బు ఇవ్వడానికే వచ్చాను అంటూ కోటి రూపాయలు తీసి ఎంఎస్ఆర్ ముందు పెడతారు. దాంతో షాక్ అయినటువంటి శైలేంద్ర ఎమ్మెస్సార్ కు సైగ చేయడంతో ఆయన వాచ్ స్పీడ్ గా పెడతారు. దీంతో ఎమ్మెస్సార్ ఇచ్చిన గడువులోపు మీరు డబ్బు తీసుకురాలేదు ఈ కాలేజ్ నాకే సొంతం అనడంతో మురగన్ ఒకేసారి కత్తి తన మీద పెట్టి తన చేతికున్న వాచ్ చూపిస్తాడు.

ఎవరి టైం సరైనది అని చెప్పడంతో మీ టైం కరెక్ట్ అంటూ ఎం ఎస్ ఆర్ చెబుతాడు. డబ్బు తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్లిపో అంటూ మురగన్ మాట్లాడగా శైలేంద్ర ఇవ్వకపోతే ఏం చేస్తావు అంటూ మాట్లాడటంతో వెళ్లకపోతే నాకు ఇష్టమైన వాళ్లు బాధపడతారు వాళ్లు బాధపడితే నాకు బాధ వేస్తుంది కాళ్లు చేతులు వణుకుతాయి. దీంతో ఈ కత్తితో నరికేది కొబ్బరి బోండానా లేక మనిషి తలన అని కూడా చూడను అంటూ మురుగన్ మాట్లాడటంతో అందరూ షాక్ అవుతారు. అయినా ఇక్కడ నీకు ఇష్టమైన వారు ఎవరు అంటూ శైలేంద్ర అంటారు ఇంతటితో (Guppedantha Manasu) ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus