చిరంజీవి మీద విష ప్రయోగం జరిగింది.. అయితే ఇప్పుడు కాదు 34 ఏళ్ల క్రితం. ఈ విషయం ఇప్పటికే కొంతమందికి తెలిసుండొచ్చు. గతంలో కొన్ని సందర్భాల్లో ఈ విషయం గురించి మీడియాలో వచ్చింది. తాజాగా మరోసారి మురళీ మోహన్ ఇంటర్వ్యూల్లో ఈ విషయం మరోసారి వైరల్ అవుతోంది. ‘మరణ మృదంగం’ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే సిబ్బంది వెంటనే గుర్తించడంతో చిరంజీవికి పెద్ద ప్రమాదం తప్పింది. ఇంతకీ ఏమైందంటే…
చిరంజీవి మీద విష ప్రయోగం ఘటన గురించి.. మురళీ మోహన్ దగ్గర ప్రస్తావిస్తే ‘‘ఆ విషయం నాకు కచ్చితంగా తెలియదు. కానీ.. చిరంజీవి ఎదుగుదలను చూసి ఆయనపై కొందరు విష ప్రయోగం చేసి ఉండొచ్చు’’ అని అన్నారు. సినీ ఇండస్ట్రీలో చిరంజీవి కంటే ముందున్న మురళీ మోహన్ లాంటి ఓ నటుడు అలా అన్నారంటే అందులో నిజం లేకపోలేదు అనే మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీంతో అప్పుడు చిరంజీవిపై విషప్రయోగం చేసింది ఎవరు, చేయించింది ఎవరు అనే ప్రశ్న వినిపిస్తోంది.
‘ఖైదీ’ సినిమా తర్వాత చిరంజీవి గ్రాఫ్ ఎలా మారిందో అందరికీ తెలిసిందే. మాస్ హీరోగా ఇమేజ్ పెరిగింది. ఈ క్రమంలో చిరంజీవి అవుట్ డోర్ షూటింగ్ దగ్గరకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చేవారట. చిరంజీవిని కలవాలని, మాట్లాడాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని అడిగేవారు. ఈ సమయంలో చిరు అంటే గిట్టని కొంతమంది ఏకంగా చిరంజీవి చంపడానికే ప్లాన్ వేశారు. ‘మరణ మృదంగం’ షూటింగ్ చెన్నైలో జరుగుతున్న సమయంలో ఓ అభిమాని వచ్చి చిరు కాళ్లు పట్టుకున్నాడు.
‘‘ఈ రోజు నా పుట్టినరోజు.. ఇక్కడ కేక్ కట్ చేస్తాను. మీరు నా దగ్గర ఉండండి’’ అని కోరాడు. పుట్టినరోజు నాడు అడిగాడు కాబట్టి చిరంజీవి ఓకే అన్నాడు. ఆ కేట్ కట్ చేసిన తర్వాత కేక్ తినాలని ఆ అభిమాని చిరంజీవిని బలవంతం చేశాడు. వద్దని చెప్పినా బలవంతంగా కేక్‌ను చిరంజీవి నోట్లో కుక్కాడు. అయితే ఏదో తేడా కొట్టి చిరంజీవి బయటకు ఉమ్మేశాడు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాటలో కేక్ కిందపడిపోయింది. ఆ కేక్‌లో ఏవో రంగురంగుల పదార్థాలు కనిపించాయి.
వెంటనే చిరంజీవి సెట్స్‌కి వెళ్లి నోరు కడుకున్నారు. ఆ తర్వాత మేకప్ సమయంలో ఆయన పెదాలు నీలి రంగులోకి మారి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. దీంతో చిరంజీవిని ఆస్పత్రిలో చేర్చారు. విషం లోపలికి వెళ్లకుండా ఉండేలా వాంతులు అయ్యేలా టాబ్లెట్స్ ఇచ్చారు. రాత్రంతా చిరంజీవి హాస్పిటల్‌లోనే ఉన్నారట. రెండో రోజు అంతా ఓకే అనుకున్నాక డిశ్చార్జి అయ్యారు. అప్పట్లో ఈ వార్త వైరల్ అయ్యింది.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!