Murali Mohan: వైరల్ అవుతున్న మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన మురళీ మోహన్ ప్రస్తుతం సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. మురళీ మోహన్ వయస్సు ప్రస్తుతం 83 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. నా హీరోయిన్లలో బెస్ట్ ఎవరనే ప్రశ్నకు జయసుధ అని చెబుతానని ఆ అమ్మాయితో చేస్తే హోమ్లీగా ఫీలవుతామని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. కొంతమంది హీరోయిన్లు పేద పాత్రలో చేసినా కాస్ట్లీ చీరలు కావాలని చెబుతారని ఆయన అన్నారు.

అప్పట్లో చాలామంది అమ్మాయిలు నాలాంటి భర్త, నాలాంటి అన్నయ్య, నాలాంటి కొడుకు కావాలని కామెంట్ చేశారని మురళీ మోహన్ అన్నారు. మేము ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలలో ఎక్కువగా చేశానని ఆయన తెలిపారు. ఏ హీరోయిన్ పై నేను మనస్సు పారేసుకోలేదని మురళీ మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడేళ్ల పాటు వ్యాపారాలు, సినిమాలతో బిజీగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయని మురళీ మోహన్ పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో ఉన్నంత కాలం తాగకూడదని ఫిక్స్ అయ్యానని రెండో పెళ్లాం, మూడో పెళ్లాం, లవర్లు ఉండకూడదని ఫిక్స్ అయ్యానని ఆయన తెలిపారు. నేను మద్యం తీసుకోనంటే నిద్ర ఎలా పడుతుందని నాగేశ్వరరావు అడిగారని ఆయన చెప్పుకొచ్చారు. మద్యం తాగడంలో కిక్ కనిపించలేదని పార్టీలలో మాత్రమే తాను డ్రింక్ చేస్తానని మురళీ మోహన్ అన్నారు. నా మీద మనస్సు పారేసుకున్న వాళ్లు ఉన్నారని కానీ వాళ్లకు ముందే నాకు పెళ్లైందని చెప్పానని ఆయన కామెంట్లు చేశారు.

భవిష్యత్తులో నా గురించి ఎవరూ చెడ్డగా ఎవరూ మాట్లాడకూడదని భావించానని మురళీ మోహన్ తెలిపారు. జయచిత్రను నేను పెళ్లి చేసుకోబోతున్నానంటూ అప్పట్లో ఒక వార్త ప్రచారంలోకి వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఒక సందర్భంలో జయచిత్రతో పెళ్లి అని దాసరి గారు ఆ పెళ్లి జరిపించినట్టు వార్త వినిపించిందని (Murali Mohan) మురళీ మోహన్ తెలిపారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus