800 Trailer: స్టార్‌ క్రికెటర్‌ జీవితం… సినిమా సిద్ధం… ట్రైలర్‌ చూశారా?

ప్రపంచ క్రికెట్‌లో ముత్తయ్య మురళీథరన్‌ లాంటి క్రికెటర్‌ ఇంకొకరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌… మురళీధరన్‌. ఈ లెజెండరీ శ్రీలంక క్రికెటర్‌ జీవిత కథతో ఓ సినిమా తెరకెక్కింది. అతని 800 వికెట్ల ఘనతనే టైటిల్‌గా పెట్టి సినిమాను తెరకెక్కించారు. మధుర్‌ మిట్టల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను, ఎంఎస్‌.శ్రీపతి తెరకెక్కించారు. అక్టోబర్ 6న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాను తెలుగులో శివలెంక కృష్ణప్రసాద్‌ తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ లాంచ్‌ చేశాడు. ఎవరికీ తెలియని ముత్తయ్య మురళీధరన్‌ జీవితంలోని కథ అంటూ మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తి కలిగించేలా సాగింది. ‘పౌర హక్కులు లేకుండా బానిసలుగా బతకాల్సిన వారికి పౌరసత్వం లభించడం కష్టం. ఈ రోజు దేశమే తిరిగి చూసేలాగా ఓ పేదవాడు గొప్పవాడయ్యాడు’ అనే మాటలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా కనిపించింది.

శ్రీలంకలోని ఒక సాధారణ తమిళ కుటుంబంలో పుట్టిన మురళీథరన్.. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగడానికి ఎంత కష్టపడ్డాడు, జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనే అంశాలను సినిమాలో చూపించబోతున్నారు. మురళీధరన్‌ జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలియాలి. ఆయన జీవితం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందించే ప్రయత్నం ఈ సినిమా. కొన్నిసార్లు మన ఆట పట్ల నిరుత్సాహపడతాం. కానీ అక్కడ నుండి మళ్లీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం.

అదే పని చేశాడు మురళీథరన్‌. అందుకే లెజెండరీ క్రికెటర్‌ అయ్యాడు. నేను బౌలింగ్‌ చేసేటప్పుడు రన్స్‌ చేయడంలో బ్రియాన్‌ లారా సక్సెస్‌ అయ్యాడు. కానీ నా బౌలింగ్‌ శైలిని పట్టుకోలేకపోయాడు. సచిన్‌ నా ఆటను పూర్తిగా చదివేశాడు అని చెప్పాడు ముత్తయ్య మురళీథరన్‌. ఇప్పటివరకు మన దగ్గర క్రికెటర్ల బయోపిక్స్‌కు మంచి స్పందనే వచ్చింది. అయితే అవన్నీ మన దేశస్థులవే. మరిప్పుడు శ్రీలంక లెజెండ్‌ బయోపిక్‌కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus