Murari Bava Song: ‘సర్కారు వారి పాట’లో కొత్త యాడ్ చేస్తున్నారట!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’ సక్సెస్ ఫుల్ గా మొదటి వీకెండ్ ను పూర్తి చేసుకుంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా అమెరికాలో రెండు మిలియన్ మార్క్ ను అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వసూళ్లు బాగానే వస్తున్నాయి. కానీ ఆశించిన స్థాయిలో సినిమా లేదని టాక్. మెజారిటీ ఏరియాల్లో ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. అయితే టికెట్ రేట్లు పెంచేయడంతో బీసీ సెంటర్లలో పెద్దగా హడావిడి కనిపించడం లేదు.

కలెక్షన్స్ గ్రాఫ్ పడిపోకుండా చూసుకోవడానికి టీమ్ పక్కా ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తోంది. కర్నూలులో సక్సెస్ మీట్ ను ఎరేంజ్ చేశారు. ఈ వేడుకకు మహేష్ బాబు కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి మహేష్ బాబు ఇలాంటి వేడుకలకు దూరంగా ఉంటారు. కానీ ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. రెండు రోజులుగా సినిమాకి సంబంధించిన ప్రోమోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ వాళ్లను ఆకట్టుకునే విధంగా సన్నివేశాలను టీజర్ల రూపంలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆడియోలో కానీ షూటింగ్ పరంగా కానీ బయటకు రాని ‘మురారి బావ’ సాంగ్ ను త్వరలోనే యాడ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు ఇచ్చిన ఇంటర్వ్యూ లను ఈ సాంగ్ గురించి మాట్లాడారు. యూట్యూబ్ లో ఈ పాటను రిలీజ్ చేస్తామని మహేష్ బాబు చెప్పారు.

కానీ ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదే ఈ పాటను చూపిస్తారంట. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఈరోజు నుంచి వీక్ డేస్ కావడంతో కలెక్షన్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు సాంగ్ ను యాడ్ చేయాలని చూస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus