Murari: రీరిలీజ్ కలెక్షన్ల విషయంలో అదరగొట్టిన మురారి.. ఎన్ని రూ.కోట్లంటే?

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు రీరిలీజ్ లో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆగష్టు నెల 9వ తేదీన మహేష్ బాబు (Mahesh Babu)  పుట్టినరోజు కానుకగా మురారి (Murari)  మూవీ రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మురారి సినిమాకు ఇప్పటివరకు ఏకంగా 8.31 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. రీరిలీజ్ కలెక్షన్ల విషయంలో ఇది ఒక రికార్డ్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.

Murari

ఖుషి (Kushi) సినిమా రీరిలీజ్ లో 7.5 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా ఆ సినిమా రికార్డ్ ను మహేష్ మూవీ సునాయాసంగా బ్రేక్ చేసింది. ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో మురారి ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో మురారి రీరిలీజ్ ఫుల్ రన్ కలెక్షన్లు 10 కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు రీరిలీజ్ లో సైతం అదిరిపోయే రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మహేష్ బాబు నటించిన మరిన్ని సినిమాలు రీరిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మహేష్ సినిమాలు రీరిలీజ్ చేస్తే మంచి లాభాలు వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. మరోవైపు మహేష్ రాజమౌళి కాంబో మూవీ అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.

సినిమా షూటింగ్ కు చాలా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటినుంచే అప్ డేట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. మహేష్ రాజమౌళి (Rajamouli) కాంబో మూవీ ఫ్యాన్స్ కు సైతం స్పెషల్ గా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus