Murari Vaa: ‘మురారి’ సాంగ్ యాడ్ చేశారు.. ‘సర్కారు వారి’ ప్లానింగ్ పై సెటైర్లు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. మహేష్ బాబు కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. మే 12న ఈ చిత్రం విడుదలైంది. మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. సినిమా ప్లాప్, డిజాస్టర్ అన్న జనాలు కంటే సినిమా బాగుంది అనే జనాలు ఎక్కువ మంది ఉండడంతో..

బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అయితే మొదటి నుండీ ఈ చిత్రం ప్రమోషన్ల విషయంలో నిర్మాతలు సరైన ప్లానింగ్ తో ప్రవర్తించలేదు. మొదటి వీకెండ్ తర్వాత కర్నూల్ లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ మినహాయిస్తే వాళ్ళు ఇంకేమి చేసింది లేదు. అయినా బాక్సాఫీస్ వద్ద 95 శాతం మూవీ రికవరీ అయ్యింది. గత వారం ‘ఎఫ్3’ రిలీజ్ అవ్వడంతో ‘సర్కారు వారి పాట’ కి స్క్రీన్లు బాగా తగ్గాయి.

దీంతో 3వ వీకెండ్ ను ఎక్కువగా క్యాష్ చేసుకోలేకపోయింది. అయితే నిన్న సడెన్ గా ఈ చిత్రంలో ఓ కొత్త పాటని యాడ్ చేసినట్లు నిర్మాతలు అధికారిక ప్రకటన ఇచ్చారు. నిన్నటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 3 వారాలు పూర్తయ్యింది. ఈరోజు నుండీ 4వ వారం స్టార్ట్ అయ్యింది. ఇలాంటి టైంలో కొత్త పాటని యాడ్ చేస్తే థియేటర్ కు ఎవరు వస్తారు. పైగా రేపటి నుండీ ‘మేజర్’ ‘విక్రమ్’ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఆ సినిమాల పై ప్రేక్షకుల్లో భీభత్సమైన క్రేజ్ ఉంది. అంతేకాకుండా అవి తక్కువ టికెట్ రేట్లతో రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ‘సర్కారు వారి పాట’ ని ఎవరైనా పట్టించుకుంటరా? మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆ కొత్త పాట కోసం థియేటర్ కు వెళ్తారు అన్నది అనుమానమే.. అన్న కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus