అర్ధరాత్రి మహేష్ పై యాక్షన్ సీన్ తీస్తున్న మురుగదాస్
- December 6, 2016 / 07:42 AM ISTByFilmy Focus
కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించడంలో దిట్ట. అతని డైరక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రంలోను ప్రేక్షకులు ఆశ్చర్యపోయే రీతిలో ఫైట్ సీన్స్ ఉండనున్నట్లు తెలిసింది. గత నెలలో హైదరాబాద్ లోని బిజీ రోడ్లపై ఛేజింగ్ సీన్ ని విజయవంతంగా పూర్తి చేసిన మురుగదాస్ ఇప్పుడు అహ్మదాబాద్ లో భారీ ఫైట్ ని షూట్ చేస్తున్నారు. 100 కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.
ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ద్రోహులను పట్టుకునే క్రమంలో ‘సబర్మతి నది’పై గల భారీ ఫ్లై ఓవర్ పై హీరోకి, విలన్ మనుషులకు పెద్ద ఫైట్ జరగనుంది. ఇప్పుడు ఆ యాక్షన్ సీన్ ని పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం ‘సబర్మతి నది’పై గల భారీ ఫ్లై ఓవర్ ను, ఆరు లైన్ల రోడ్ ను సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు బ్లాక్ చేసారు. అక్కడి ప్రభుత్వం, అధికారులతో అన్ని అనుమతులు తీసుకున్నారు. ఈ ఫైట్ సినిమాలో హైలెట్ కానుందని చిత్ర బృందం వెల్లడించింది. సూపర్ స్టార్ సరసన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ జనవరి ఫస్ట్ కి రిలీజ్ చేయనున్నారు. అప్పుడే టైటిల్ కూడా రివీల్ కానుంది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













