సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నమూవీ మూడు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 60 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. గత నెల రోజులుగా హైదరాబాద్ బిజీ రోడ్లపై షూట్ చేసిన ఛేజింగ్ సీన్ బాగా వచ్చిందని మురుగదాస్ బృందం సంతృప్తిగా ఉంది. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య ఆకట్టుకోనున్నారు.
100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ నాలుగో షెడ్యూల్ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో జరగనుంది. ఇక్కడ మహేష్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య రొమాంటిక్ సీన్స్ తో పాటు, కొన్నికీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈనెల 24 నుంచి మొదలై దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలనే ఆలోచనలో డైరక్టర్ ఉన్నారు. అక్కడకు వెళ్లే ఏర్పాటుల్లో మురుగ దాస్ టీమ్ బిజీగా ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.