Anirudh: తమన్ స్పీడ్ కి బ్రేకులేస్తాడా..?

టాలీవుడ్ లో వరుస సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా మారారు తమన్. స్టార్ హీరోలంతా తమ సినిమాకి తమన్ మ్యూజిక్ ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. సినిమా సక్సెస్ లో తమన్ కి భారీ క్రెడిట్ ఇస్తున్నారు. ఇలాంటి క్రేజే కోలీవుడ్ లో అనిరుధ్ కి ఉంది. ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో విడుదలై సక్సెస్ అందుకున్న సినిమాల్లో అనిరుధ్ సంగీత దర్శకత్వం వహించిన సినిమాలే ఎక్కువ.

ఏప్రిల్ 13న విడుదలైన ‘బీస్ట్’ సినిమాతో అనిరుధ్ హంగామా మొదలైంది. ఆ తరువాత ‘కన్మణి రాంబో ఖతీజా’, ‘డాన్’, రీసెంట్ గా ‘విక్రమ్’ సినిమాలతో హిట్స్ అందుకున్నారు. అయితే టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న తమన్ స్పీడ్ కి అనిరుధ్ బ్రేక్స్ వేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి అనిరుధ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ నటించబోయే కొత్త సినిమాకి కూడా అనిరుధ్ ని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.

‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి అనిరుధ్ ఓ సినిమా చేయబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో సినిమా పూర్తయ్యాక గౌతమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి అనిరుధ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేశారట. గౌతమ్, అనిరుధ్ ఇద్దరూ కలిసి గతంలో ‘జెర్సీ’ సినిమాకి పని చేశారు. ఈ సినిమా మంచి హిట్ అయింది.

ఆ రిలేషన్ తోనే ఇప్పుడు చరణ్ సినిమాకి అనిరుధ్ ని తీసుకోవాలనుకుంటున్నారు గౌతమ్ తిన్ననూరి. ఇలా టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటున్నాడు అనిరుధ్. మరి ఇక్కడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదుగుతాడేమో చూడాలి!

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus