Devil Movie: డెవిల్ మూవీపై అంచనాలు పెంచిన మ్యూజిక్ డైరెక్టర్.. ఏం చెప్పారంటే?

కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఏదనే ప్రశ్నకు బింబిసార సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ ఒక హీరోయిన్ గా నటించారు. కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబోలో డెవిల్ టైటిల్ తో మరో సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఈ నెల 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

కొత్త తరహా కథాంశంతో డెవిల్ తెరకెక్కగా ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డెవిల్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పుకొచ్చారు. డెవిల్ మూవీ 1940 బ్యాక్ డ్రాప్ కావడంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

డెవిల్ ఇప్పటితరం మూవీ అని బింబిసారను మించి ఈ సినిమా ఉంటుందని ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నట విశ్వరూపాన్ని చూపిస్తారని హర్షవర్ధన్ రామేశ్వర్ కామెంట్లు చేశారు. అభిషేక్ నామా నన్ను చాలా నమ్మారని ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వస్తాయేమో అని ఆయన కామెంట్లు చేశారు. సౌందర రాజన్ ఈ సినిమాకు కెమెరామేన్ అని ఆయన ప్రాణం పోశారని హర్షవర్ధన్ రామేశ్వర్ పేర్కొన్నారు.

డెవిల్ సినిమాలో మొత్తం మూడు పాటలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. నాకు మ్యూజిక్ బేస్డ్ సినిమాకు డైరెక్ట్ చేయాలని ఉందని హర్షవర్ధన్ రామేశ్వర్ కామెంట్లు చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ కు ఎంతోమంది ఫిదా అవుతున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus