టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) ..ది భిన్న శైలి. అతని మ్యూజిక్..ను ఇష్టపడని వారంటూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ‘హ్యాపీ డేస్’ (Happy Days) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) ‘అఆ’ (A Aa) వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు మిక్కీ జె మేయర్. సినిమాలు ప్లాప్ అయినా మిక్కీ మ్యూజిక్ మాత్రం ఫెయిల్ అయిన సందర్భాలు లేవు. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) వంటి పెద్ద సినిమాలకు సంగీతం అందించే అవకాశాలు దక్కించుకుంటున్నాడు.
ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’ నుండి విడుదలైన 2 పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) సినిమాకి కూడా హాలీవుడ్ సినిమాల స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) కి కూడా ముందుగా మిక్కీ జె మేయర్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. కానీ తర్వాత అతన్ని తప్పించి సంతోష్ నారాయణ్ (Santhosh Narayanan) ని ఎంపిక చేసుకున్నారు. అతని మంచి మ్యూజిక్ ఇచ్చాడు.
కానీ మిక్కీని ఎందుకు తప్పించారు అనే ప్రశ్నలు చాలా మందిని వెంటాడాయి. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘కల్కి 2898 ad ‘ కోసం మిక్కీని కాస్త ఎక్కువ టైం అడిగారట. పారితోషికం ప్రస్తుతం తన మార్కెట్ ను బట్టే ఇస్తామని చెప్పారట. అయితే మిక్కీకి ఆ టైంలో రామబాణం (Ramabanam) , గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna) , పెదకాపు 1 (Peddha Kapu 1) , ఆపరేషన్ వాలెంటైన్ వంటి వరుస ఆఫర్లు ఉండటంతో.. సున్నితంగా ‘కల్కి..’ ఛాన్స్ వదులుకున్నాడట.