Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర స్పెషల్ ఇంటర్వ్యూ..!

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర స్పెషల్ ఇంటర్వ్యూ..!

  • February 17, 2020 / 04:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర స్పెషల్ ఇంటర్వ్యూ..!

ఇప్పుడున్న టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్రకు ఓ ప్రత్యేకత ఉంది. చెప్పుకోవడానికి పెద్ద సినిమాలు ఏమీ చెయ్యలేదు. కానీ ఈయన సంగీతంలో వచ్చిన ఎన్నో పాటలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. చాలా మంది ప్లే లిస్ట్స్ లో ఈయన సంగీతంలో వచ్చిన పాటలే ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. ‘నచ్చావులే’ ‘మనసారా’ ‘కార్తికేయ’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ఇలా ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. ఇటీవల వచ్చిన ‘సవారి’ చిత్రంలోనే ‘నీ కన్నులు’ ‘ఉండిపోవా’ పాటలు పెద్ద చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పటి వరకూ కేవలం మెలోడీ సాంగ్స్ మాత్రమే అందిస్తూ ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన శేఖర్ చంద్ర ఒక్కసారిగా మాస్ మ్యూజిక్ అందిస్తే ఎలా ఉంటుందో ‘నీ కన్నులు’ పాట నిరూపించింది అనడంలో సందేహం లేదు.

Sekhar Chandra Movies

ఇక శేఖర్ చంద్ర ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 13 ఏళ్ళు పైనే అయ్యింది. అయితే ‘సవారి’ పాటల తర్వాత నెటిజన్లు ఈయన గురించి ఎక్కువగా గూగుల్ ను అడుగుతున్నారు. అంతలా ‘సవారి’ పాటలు హిట్ చెప్పాలి. ఇదిలా ఉండగా.. ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ‘మంచు పల్లకి’ ‘లేడీస్ టైలర్’ ‘నువ్వేకావాలి’ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ‘గమ్యం’ వంటి ఎన్నో చిత్రాలకి ఆయన సినిమాటోగ్రఫర్ గా పనిచేసారు. ఆయన తనయుడే మన మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. అలా అని తన తండ్రి పేరును ఎప్పుడూ వాడుకోలేదు. తన సొంత ట్యాలెంట్ తోనే ఇంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఈయన సంగీతంలో తెరకెక్కిన ‘వలయం’ చిత్రం కూడా ఫిబ్రవరి 21 న విడుదల కాబోతుంది. ఈ చిత్రం నుండీ ఇటీవల విడుదల చేసిన ‘నిన్ను చూసాకే’ అనే పాటకి కూడా మంచి స్పందన లభించింది. ఇక ఈ నేపథ్యంలో ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న శేఖర్ చంద్ర కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నాడు.

ఇప్పుడు ఎక్కడ చూసినా మీ పాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎలా ఫీలవుతున్నారు?
చాలా హ్యాపీగా ఫీలవుతున్నానండీ. ముందుగా అందరికీ థాంక్స్ చెప్పాలి. ‘నచ్చావులే’ సినిమా నుండీ నన్ను ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ‘సవారి’ పాటల్ని ఇంత పెద్ద హిట్ చేసారు. ముఖ్యంగా ‘నీ కన్నులు’ పాటకి వచ్చిన రెస్పాన్స్ నేను అస్సలు మర్చిపోలేను. ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ అన్నకి థాంక్స్ అలాగే లిరిక్స్ అందించిన కాసర్ల శ్యామ్ గారికి కూడా పెద్ద థాంక్స్.

Sekhar Chandra Special Interview About Valayam Movie1

మీ కెరీర్ ఎలా నడుస్తుంది అనుకుంటున్నారు..!
చూస్తున్నారు కదండీ.. చాలా కూల్ గా వెళ్తుంది. నా పాటలన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. వాటికి ఎక్కువగా టిక్ టాక్ లు కూడా చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Sekhar Chandra Special Interview About Valayam Movie2

ఇప్పటి వరకూ మీ మెమొరబుల్ మూమెంట్ ఏంటి?
నేను ఇప్పటి వరకూ చేసిన పెద్ద సినిమా ‘118’ . అందులో ఒకే ఒక్క పాట ఉంటుంది. చెప్పాలంటే అది పెద్ద చాలెంజ్. గుహన్ గారు డైరెక్టర్.. కళ్యాణ్ రామ్ గారు హీరో. కాబట్టి ఆ సినిమాలో ఉన్న ఆ ఒక్క పాటకి న్యాయం చేయగలనా అని భయం వేసింది. అందులోనూ అది థ్రిల్లర్ సినిమా. కానీ ‘చందమామే’ అనే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ గారు నన్ను అభినందించారు. నా కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాట అన్నారు. అది నా మెమొరబుల్ మూమెంట్ .

Sekhar Chandra Special Interview About Valayam Movie3

మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది.?
14 ఇయర్స్ అయ్యిందండి. ఇప్పటివరకూ 32 నుండీ 35 సినిమాల వరకూ చేశాను.

Sekhar Chandra Special Interview About Valayam Movie4

పెద్ద హీరోల సినిమాలు చేయడం లేదు అని ఫీలవుతుంటారా?
కచ్చితంగా ఆ ఫీలింగ్ ఉంటుంది. అయితే నేను చేసేవి చిన్న సినిమాలు అయినప్పటికీ.. కొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు. కాబట్టి.. ఫ్రెష్ మ్యూజిక్ ఇవ్వగలుగుతున్నాను. మంచి అప్లోజ్ వస్తుంది. పేరు తెచ్చిపెట్టడానికి పెద్ద సినిమానే అవసరం లేదు కదా..!

Sekhar Chandra Special Interview About Valayam Movie5

ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలు.. లవ్ స్టొరీలే చేస్తున్నారు. వాటి వలన ఎక్కువగా ఏది ప్లస్ అవుతుందని భావిస్తారు?
లవ్ స్టొరీస్ వల్ల మంచి మెలోడీస్… ఇక థ్రిల్లర్స్ చేయడం వల్ల మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇచ్చే అవకాశం ఉంటుంది.

Sekhar Chandra Special Interview About Valayam Movie6

సోషల్ మీడియా వంటి ప్లాట్ ఫామ్స్ కి దూరంగా ఉండడానికి కారణం..?
ఎందుకో ఇప్పటి వరకూ దాని గురించి ఆలోచించలేదు.. రీసెంట్ గా రాహుల్ సిప్లిగంజ్ కూడా ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చెయ్యి అని చెప్పారు. ఇప్పటి నుండీ వాటి గురించి ఆలోచిస్తాను.

Sekhar Chandra Special Interview About Valayam Movie7

మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ లో మీకు బాగా నచ్చిన పాటలు ఏవి?
‘సవారి’ మూవీ లో ‘నీ కన్నులు’ ‘ఉండిపోవా’ అలాగే ‘118’ మూవీలో ‘చందమామే’, ‘కార్తికేయ’ లో ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’, ‘మేం వయసుకు వచ్చాం’ మూవీలో ‘వెళ్ళిపోకే’ .. ఈ పాటలు ఇష్టం.

Sekhar Chandra Special Interview About Valayam Movie8

మిగిలిన భాషల్లో కూడా సినిమాలు చేస్తారా?
ప్రస్తుతానికి తెలుగులో సాధించాల్సింది చాలా ఉంది. దాని తర్వాత ఎప్పుడైనా చూద్దాం(నవ్వుతూ)

Sekhar Chandra Special Interview About Valayam Movie9

మీ నాన్నగారు ఓ సినిమాటోగ్రఫర్.. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అన్నప్పుడు.. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు?
షాకయ్యారు.. సినిమాటోగ్రఫీ అంటే పర్వాలేదు.. కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా అంటే చాలా రిస్క్ అని చెప్పారు. కానీ కొన్ని సినిమాలు చేసాక.. వాటికి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆయనకి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది.

Sekhar Chandra Special Interview About Valayam Movie10

మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఎవరు?
ఏ.ఆర్.రెహమాన్ గారు.. అలాగే కీరవాణి గారు..!

Sekhar Chandra Special Interview About Valayam Movie11

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?
‘వలయం’ చేశాను .. ఈ 21న విడుదల కాబోతుంది. ఇక ‘హుషారు’ టీం వాళ్ళది.. ఓ మూవీ ఫైనల్ కావాల్సి ఉంది.

Sekhar Chandra Special Interview About Valayam Movie12
– Interview by Phani Kumar

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ekkadiki Potaavu Chinnavada Movie
  • #Karthikeya
  • #Manasara
  • #music director Sekhar chandra
  • #music Director Shaker Chandra

Also Read

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

related news

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా చిత్రాలయం స్టూడియోస్ రూపొందిస్తోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్ విడుదల

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా చిత్రాలయం స్టూడియోస్ రూపొందిస్తోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్ విడుదల

trending news

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

13 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

13 hours ago
Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

13 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

13 hours ago
K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

13 hours ago

latest news

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

15 hours ago
Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

15 hours ago
Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

15 hours ago
Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

15 hours ago
Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version