Spirit: స్పిరిట్‌ సౌండ్ మొదలైంది.. సందీప్ వంగా క్రేజీ అప్డేట్!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్  (Prabhas)  మరియు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా  (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అర్జున్ రెడ్డి (Arjun Reddy), యానిమల్ (Animal) వంటి విజయవంతమైన సినిమాలు తీసిన సందీప్, ఇప్పుడు ప్రభాస్‌తో మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనులు మొదలవ్వడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. దీపావళి సందర్భంగా సందీప్, స్పిరిట్ మ్యూజిక్ పనులు స్టార్ట్ చేసినట్లు ట్వీట్ చేయడం ప్రభాస్ అభిమానులను మరింత ఉత్సాహపరచింది.

Spirit

సందీప్ సినిమాల్లో మ్యూజిక్ కూడా హైలెట్ అవుతుంది. ఇక స్పిరిట్ కు సంబంధించిన సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రధానంగా మ్యూజిక్ డైరెక్టర్ తోనే ఎక్కువగా చర్చలు జరుపుతున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నాడు. ఆయన అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.

సాంగ్స్ విషయంలో ఈ సారి హర్షవర్ధన్ మాయ చేస్తాడని సందీప్ చెబుతున్నారు. ప్రభాస్ ప్రస్తుత షెడ్యూల్‌లు పూర్తవగానే స్పిరిట్‌ షూట్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’ (The Rajasaab) అనే హారర్ కామెడీ సినిమాలో, అలాగే హను రాఘవపూడి (Hanu Raghavapudi)  దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. వీటి పనులు ముగిసిన తరువాత స్పిరిట్ షూట్‌లో ప్రభాస్ పూర్తిగా నిమగ్నమయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఇక ‘సలార్'(Salaar), కల్కి  (Kalki 2898 AD) సీక్వెల్‌ ప్రాజెక్టులు కూడా ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి. వీటిని పూర్తిచేసిన తరువాత మాత్రమే స్పిరిట్ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ పూర్తిగా ఫోకస్ చేయనున్నాడు. స్పిరిట్ లో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ పాత్ర కోసం కొత్త లుక్‌లో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

‘విశ్వంభర’ ముందొస్తాడా? తర్వాత వస్తాడా? డౌట్స్‌ క్రియేట్‌ చేసిన రవితేజ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus