‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా అనౌన్స్ చేసినప్పుడు సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమా టీమ్ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది అని, పక్కాగా అనుకున్న సమయానికి వచ్చేస్తారు అని సందర్భం వచ్చినప్పుడల్లా టీమ్ చెబుతూ వచ్చింది. అయితే ఇప్పుడు సినిమాను వాయిదా వేశారు. తాము అనుకున్న డేట్‌ను ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు ఇచ్చేశారు. దీంతో ‘విశ్వంభర’ (Vishwambhara) ఎప్పుడు అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది. లక్కీ డేట్ మే 9 అవ్వొచ్చు అని ఇటీవల వార్తలొచ్చాయి.
బట్ ఇప్పుడు అవీ ఆవిరైపోయాయి అని చెప్పాలి. ఎందుకంటే రవితేజ (Ravi Teja) తన కొత్త సినిమా ‘మాస్ జాతర’ (Mass Jathara) ను ఆ రోజున తీసుకొస్తాం అని అనౌన్స్ చేశారు. దీంతో చిరంజీవి మౌనం వీడాల్సిన సమయం వచ్చింది అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. మే కాదంటే మళ్లీ ఏ ఆగస్టు వరకు సినిమా రాకపోవచ్చు అంటున్నారు. లేదంటే మార్చిలో రావాల్సిందే అని లెక్క కడుతున్నారు.
ఒకవేళ సినిమా టీమ్ మార్చి నెలాఖరున సినిమాను తీసుకురావాలని అనుకుంటే.. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాకు అనుకున్న డేట్‌ను చిరంజీవి అడగాల్సి ఉంటుంది. ‘హరి హర..’ సినిమా చాలా ఏళ్లుగా ఈ సినిమా ఆగుతూ వస్తోంది. కాబట్టి ఇప్పుడు సినిమా వాయిదా వేయమని అడుగుతారా అనేదే ప్రశ్న. చిరంజీవి అడిగితే పవన్ టీమ్ నో చెప్పదు. మరి చిరంజీవి సినిమా టీమ్ అడుగుతారా అనేది చూడాలి.
మే నెలలోనే రావాలి అని ఫిక్స్ అయితే.. మే 9నే ఎంచుకుంటారు. ఎందుకంటే చిరంజీవి బ్లాక్‌బస్టర్ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా వచ్చిన మే 9న వచ్చింది. మరి చిరంజీవి కోసం రవితేజ తన డేట్ మారుస్తాడా? లేక చిరంజీవే 9 వద్దు ఐదో నెల చాలు అనుకుంటారా అనేది తేలాలి. ఇవన్నీ ఉండకూడదు అనుకుంటే మార్చిలో వచ్చేయాలి, మరీ లేదంటే ఏప్రిల్ నెలలో మంచి డేట్ చూసుకున్నా ఫర్వాలేదు.