ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య అందరికీ తెలిసే ఉండొచ్చు. ‘మామగారు’, ‘కలికాలం’, ‘ఎర్ర మందారం’ వంటి చిత్రాలతో ఈయన టాలెంట్ ఏంటో చూపించారు. అలాగే అప్పటి స్టార్ హీరోలలో చాలా మందితో ఈయన సినిమాలు చేశారు. చిరంజీవితో ‘హిట్లర్’, ‘అన్నయ్య’ .. వెంకటేష్ తో ‘పవిత్ర బంధం’ .. పవన్ కళ్యాణ్ తో ‘గోకులంలో సీత’ వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారాయన. గోపీచంద్ ను హీరోగా లాంచ్ చేసింది కూడా ముత్యాల సుబ్బయ్యనే..! కొత్త డైరెక్టర్ల ఎంట్రీతో ఈయన హవా తగ్గిపోయింది.
దీంతో చాలా కాలం ఈయన సినిమాలకు దూరంగా ఉన్నారు. మీడియాకి కూడా ఎక్కడా కనిపించింది లేదు. అయితే ఎట్టకేలకు ఈయన ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన కెరీర్ ప్రారంభంలో ఫేస్ చేసిన ఛాలెంజెస్ గురించి చెప్పుకొచ్చారు. ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ… “నేను పుట్టింది ప్రకాశం జిల్లా కె.బిట్రగుంట గ్రామంలో. మొదట్లో నాటకాలు వేయడం మొదలుపెట్టాను. తర్వాత అందులో నాటకాల్లో అనుభవం ఉంది కాబట్టి ..
సినిమాల్లో ట్రై చేద్దామని చెన్నై కి వెళ్లాను. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉండేవాడిని .. నెలకు 150 రూపాయలు జీతంగా ఇచ్చేవారు.ఆ టైంలో పెళ్లి చేసుకుంటే డబ్బులు చాలవని ఆ ఆలోచన పెట్టుకోలేదు. అయితే నేను డైరెక్టర్ గా సినిమాలు చేయడానికి ముగ్గురు నిర్మాతలు ముందుకు వచ్చారు. అబ్బో.. ఇక వరుస అవకాశాలు వస్తాయని భావించి పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ముగ్గురు నిర్మాతలు హ్యాండ్ ఇచ్చారు.
అప్పుడు 7 ఏళ్ల పాటు అవకాశాల కోసం ఎదురు చూశాను. ఆ టైంలో నేను పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరిగ్గా ఇలాంటి టైంలో టి. కృష్ణ గారి దగ్గర కో డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఆయన దగ్గర 6 సినిమాలకు పని చేశాను. ఆ తర్వాత దర్శకుడిగా ‘అరుణ కిరణం’ అనే సినిమా చేయడం జరిగింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు” అంటూ చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!