టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Makers) మరోసారి తన సత్తా చూపించింది. చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమాలను కేవలం ఒక్క వారం గ్యాప్‌లో రిలీజ్ చేసి హిట్ కొట్టిన మైత్రీ, ఈసారి మరింత రిస్క్ తీసుకొని హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్ 10న ఒకేరోజు రెండు భారీ చిత్రాలు థియేటర్లలో విడుదల చేసింది. అవే కోలీవుడ్ తల అజిత్ (Ajith Kumar) నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) మరియు బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) నటించిన ‘జాట్’ (Jaat).
ఒకే రోజు రెండు భిన్న భాషా సినిమాలను రిలీజ్ చేయడం మామూలు విషయం కాదు. కానీ మైత్రీ సంస్థ ఈ ప్లాన్‌తో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ ఇప్పటికే రూ.152 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇది అజిత్ కెరీర్‌లో ఫాస్టెస్ట్ గ్రాస్ మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
ఇక సన్నీ డియోల్ నటించిన ‘జాట్’ సినిమా విషయానికొస్తే, తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) రూపొందించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి స్థాయిలో రాబడుతోంది. ఇప్పటివరకు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం, నార్త్ ఇండియాలో పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌ను సంపాదించింది. మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేయడం వల్ల ప్రమోషన్, థియేటర్ షేరింగ్, డిస్ట్రిబ్యూషన్..
ఇలా అన్ని కోణాల్లో తప్పనిసరిగా కష్టతరమైన విషయాలు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ దాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది. ప్రొఫెషనల్ టీమ్ ప్లానింగ్‌తో, సక్సెస్‌ను తమవైపు తిప్పుకుంది. మొత్తానికి మైత్రీ సంస్థ మరోసారి రిస్క్ తీసుకుని రివార్డ్ పొందింది. డబుల్ రిలీజ్‌కు డబుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ నిర్ణయం సినిమాటిక్ ప్లానింగ్‌కు గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. ఇకపై మైత్రీ తరఫున వచ్చే సినిమాలపైనా అంచనాలు మరింత పెరిగే అవకాశముంది.