‘సర్కారు వారి పాట’ విషయంలో అవి బానే ఫాలో అవుతున్నారు కానీ..!

‘సర్కారు వారి పాట’.. మహేష్ బాబు నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ. మే 12న విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. కానీ మహేష్ ఫ్యాన్స్ ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉండడం వల్ల వీకెండ్ మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆంధ్ర రీజన్లో ఈ మూవీ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. అయితే నైజాంలో మాత్రం బుకింగ్స్ జస్ట్ డీసెంట్ లేదా యావరేజ్ అన్నట్టు మాత్రమే ఉంటున్నాయి.

దీనికి ప్రధాన కారణం.. నైజాంలో టికెట్ రేట్లు భారీగా పెంచేయడం అని చెప్పాలి. ప్రభుత్వాన్ని అడిగి మరీ వారంరోజుల వరకు టికెట్ రేట్ల హైక్ ను తెచ్చుకుంది ‘సర్కారు వారి పాట’ టీం. వీకెండ్ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్ 2’ చిత్రాలకు కూడా టికెట్ రేట్లు తగ్గించారు. అవి పాన్ ఇండియా సినిమాలు, ఆడియెన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేసిన సినిమాలు కాబట్టి.. టికెట్ రేట్లతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాల్ని చూశారు.

కానీ ‘సర్కారు వారి పాట’ కి మిక్స్డ్ టాక్ మాత్రమే వచ్చింది. అయినా టికెట్ రేట్లు తగ్గలేదు. ఒకవేళ నిన్నటి నుండీ తగ్గించి ఉంటే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ బాగుండేవి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిర్మాతలు చేసిన తెలివైన పని ఏదైనా ఉందా అంటే అది సక్సెస్ సెలబ్రేషన్స్ ను సీడెడ్ లో జరపడమనే చెప్పాలి. మహేష్ బాబు సినిమాలకి అక్కడ ఎక్కువ కలెక్షన్లు నమోదు కావు.

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీస్ సినిమాలకి మాత్రమే అక్కడ మంచి క్రేజ్ ఉంది. ‘సర్కారు వారి పాట’ సక్సెస్ సెలబ్రేషన్స్ ను అక్కడ నిర్వహించడం వల్ల అక్కడ ఈ సినిమాకి మరింతగా బుకింగ్స్ జరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వానికి మరింతగా బిస్కట్లు వేసే విధంగా కూడా ఉంటుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus