నైజాంలో ఆ రెండు పంపిణీ సంస్థలకు మైత్రీ మూవీ మేకర్స్‌ కౌంటర్‌ ఎటాక్‌!

నైజాంలో తెలుగు సినిమా, తమిళ సినిమా విడుదల అంటే ఠక్కున గుర్తొచ్చే పంపిణీ సంస్థలు ఒకటి దిల్‌ రాజు టీమ్‌, రెండోది ఏషియన్‌ సినిమాస్‌ టీమ్‌. గత కొన్నేళ్లుగా వీళ్ల హవానే నడుస్తోంది. మధ్యలో వరంగల్‌ శ్రీను లాంటి వ్యక్తి ఉప్పెనలా వచ్చినా… సినిమాల ఎంపికలో తేడా కొట్టి అవుటాఫ్‌ ది ఇండస్ట్రీ లాంటి పరిస్థితి వచ్చింది. దీంతో ‘ఇక నైజాంలో ఇద్దరేనా?’ అనే మాట వినిపిస్తున్న తరుణంలో ‘మైత్రీ మూవీ మేకర్స్‌’ కూడా ఈ రంగంలోకి వస్తున్నారు అనే ముచ్చట బయటికొచ్చింది.

టాలీవుడ్‌లో అందులోనూ నైజాం ఏరియాలో మోనోపల్లిని దూరం చేయడానికి మైత్రీ టీమ్‌ ప్లాన్స్‌ వేస్తోందని ఆ మధ్యే వార్తలొచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ… ఈ టీమ్‌ ‘సలార్‌’ నైజాం హక్కులను కొనుగోలు చేసిందని చెబుతున్నారు. ఈ విషయంలో నిజం ఎంతుంది అనే విషయం తెలియకపోయినా… ఇది జరిగితే మాత్రం నైజాం ఏరియాలో టాలీవుడ్‌ సినిమాల పరిస్థితిలో మార్పు వస్తుంది అంటున్నారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ల రంగంలోకి మైత్రీ టీమ్‌ వస్తే భారీ మార్పులు పక్కా అనే టాక్‌ రావడమే.

ఇక ‘సలార్‌’ (Salaar) సినిమా సంగతి చూస్తే… ప్రభాస్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా తొలి పార్టుకు మైత్రి టీమ్‌ రికార్డు ధర కోట్ చేసి మరీ తీసుకుందని టాక్. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని టాక్‌. ఇక ఈ సినిమాను డిసెంబరు 22న విడుదల చేస్తామని ఇటీవల టీమ్‌ ప్రకటించింది. అదే రోజు షారుఖ్‌ ఖాన్‌ – రాజ్‌ కుమార్‌ హిరానీ ‘డంకీ’ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

‘సలార్‌’ తర్వాత కొన్ని రోజులకు ప్రభాస్ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ చేయనుంది. ఈ నేపథ్యంలో మైత్రీ టీమ్‌ ‘సలార్‌’ పంపిణీకి ముందుకొచ్చారు అని చెబుతున్నారు. మరి ఈ సినిమా వచ్చే సమయానికి దిల్‌ రాజు ఇంకే సినిమా రిలీజ్‌ చేయడానికి ముందుకొస్తారో చూడాలి అనే కామెంట్‌ సోషల్‌ మీడియాలోకనిపిస్తోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus