‘దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla) టైం అయిపోయింది’ అని అంతా జోకులేసుకునే ప్రతిసారి ఓ క్రేజీ ఆఫర్ పడుతూ అందరికీ షాకిస్తున్నాడు. ‘ఆగడు’ (Aagadu) … నుండి శ్రీను వైట్ల క్రేజ్ తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ నెక్స్ట్ సినిమాని చరణ్ (Ram Charan) వంటి స్టార్ తో చేయగలిగాడు. డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మాత. అది ఫ్లాప్ అయ్యింది. అయినా సరే వరుణ్ తేజ్ (Varun Tej) తో ‘మిస్టర్’ (Mister) అనే సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. దానికి కూడా రూ.35 కోట్లు బడ్జెట్ పెట్టే నిర్మాత దొరికాడు.
తర్వాత ‘మైత్రి’ లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (Amar Akbar Anthony) చేశాడు. ఇది పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో శ్రీను వైట్లతో (Srinu Vaitla) సినిమాలు చేయడానికి దర్శకులు సాహసించలేదు. అయినప్పటికీ ‘పీపుల్ మీడియా’ ‘చిత్రాలయం స్టూడియోస్’ వంటి బ్యానర్లను పట్టి రూ.35 కోట్ల బడ్జెట్ తో ‘విశ్వం’ (Viswam) చేశాడు. ఇది కాస్తో కూస్తో పర్వాలేదు అనిపించింది. అందుకే ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రి’.. మరోసారి శ్రీను వైట్లకి ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇది కూడా ఓ కమర్షియల్ డ్రామా అని తెలుస్తుంది.
‘సామజవరాగమన’ (Samajavaragamana) కి ఓ రైటర్ గా పనిచేసిన నందు.. డిజైన్ చేసిన కథ, స్క్రీన్ ప్లేతో శ్రీను వైట్ల (Srinu Vaitla) ఓ సినిమా చేయబోతున్నాడట. దీనికి హీరో ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ మైత్రి వాళ్ళు కాబట్టి మంచి హీరోనే పడతారు..పెడతారు. కాకపోతే శ్రీనువైట్లకి.. చెప్పిన టైంలో, చెప్పిన బడ్జెట్లో సినిమా చేసి ఇవ్వాలనే కండిషన్ పెట్టారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తారు.