Pushpa2: బన్నీ అభిమానులపై సీరియస్ అయిన పుష్ప టీమ్!

మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రాలలో పుష్ప 2 ఒకటి. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని అంతకుమించి ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే కొన్ని షెడ్యూల్ చిత్రీకరణ పూర్తికాగా తాజాగా ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ వైజాగ్ లో జరుగుతుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి తరలివచ్చారు. అయితే షూటింగ్ జరుగుతున్న సన్నివేశాలను సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బన్నీ అభిమానుల తీరు పట్ల చిత్ర బృందం సీరియస్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ లోకేషన్ నుంచి అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా లోకేషన్ నుంచి ఫోటోలు లేకపోవడంతో చిత్ర బృందం కాస్త ఆందోళన వ్యక్తం చేశారు.

షూటింగ్ లోకేషన్ నుంచి ఎలాంటి ఫోటోలు వీడియోలు కానీ లీక్ కాకుండా ఉండటం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఇలా వరుసగా లీక్ అవడంతో మూవీ మేకర్స్,ఇతర చిత్ర బృందం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పుష్ప 2 సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకోవాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది. అల్లు అర్జున్ ఇతర చిత్ర బృందం పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. వచ్చే నెల నుంచి హీరోయిన్ రష్మిక కూడా ఈ సినిమా షూటింగులో భాగం కానున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus