టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఒకటనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ ప్రముఖ టాలీవుడ్ హీరోలతో వరుసగా సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉండటం గమనార్హం. అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కితే ఆ సినిమా మూడు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. స్టార్ హీరోల అభిమానులు ఈ విషయంలో మైత్రీ నిర్మాతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప ది రైజ్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫుల్ రన్ లో ఏకంగా 160 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. అయితే రిలీజైన మూడు వారాలకే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడంతో ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది. రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.
199 రూపాయలు చెల్లించడం ద్వారా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను చూడవచ్చు. డబ్బులు చెల్లించిన తర్వాత 48 గంటల్లో ఈ సినిమాను ఎన్నిసార్లు అయినా చూడవచ్చు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ విధంగా తక్కువ సమయంలోనే ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ బ్యానర్ పై తెరకెక్కే సినిమాల థియేట్రికల్ కలెక్షన్లపై కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది.
మైత్రీ నిర్మాతలు ఇకపై తమ బ్యానర్ పై తెరకెక్కే సినిమాలను ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఈ బ్యానర్ నుంచి ఈ నెల 10వ తేదీన అంటే సుందరానికి సినిమా రిలీజ్ కానుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.