మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ల స్టయిల్‌ను గమనించారా. పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు? అవి జరుగుతుండగానే దర్శకులు, హీరోలకు భారీ అడ్వాన్స్‌లు ఇచ్చేస్తుంటారు. దాని వెనుక వాళ్లకు ఏదో స్ట్రాటజీ ఉండే ఉంటుంది. తాజాగా ఈ స్ట్రాటజీని వాడి మరో దర్శకుడికి పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసేశారట. దీంతో ఆ దర్శకుడి కోసం హీరోను వెతుక్కోవడమే పని. అన్నట్లు ఆ దర్శకుడితో సినిమా అంటే హీరోలు కూడా వెంటనే డేట్స్ ఇచ్చేంత టాలెంట్ ఉంది అతనిలో.
మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు తెలుగులోనే కాకుండా తమిళంలోనూ సినిమాలు చేయాలని చూస్తున్నారని టాక్. ఈ క్రమంలో లోకేశ్ కనగరాజ్‌కు అడ్వాన్స్ ఇచ్చారట. అయితే మరి లోకేశ్ చేయబోయేది తెలుగు సినిమానా, లేక తమిళ సినిమానా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే లోకేశ్‌కి ₹5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు అనేదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అంత అమౌంట్ ఇచ్చి డైరక్టర్‌ను లాక్ చేయడం ఎందుకబ్బా అనేది తెలియడం లేదు.
ప్రశాంత్ నీల్ విషయంలోనూ మైత్రీ మూవీ మేకర్స్ ఇదే స్టైల్‌ను వాడింది. ముందుగా నీల్‌కు అడ్వాన్స్ ఇచ్చి ఫిక్స్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో నీల్ సినిమా ఉంటుందని చెప్పింది. మరిప్పుడు లోకేశ్ కనగరాజ్‌కు అడ్వాన్స్ ఇచ్చింది ఎవరికోసమే చూడాలి. అయితే రామ్‌చరణ్, మైత్రీ మూవీమేకర్స్ కాంబోలో మరో సినిమా ఉండనుందనే వార్తలు చాలా రోజుల నుండి వస్తున్నాయి. ఆ సినిమాకు లోకేశ్ దర్శకత్వం వహిస్తాడా… ఏమో చూడాలి.