ఈ ఏడాది సంక్రాంతికి మైత్రి మూవీస్ సంస్థ నుంచి రెండు సినిమాలు విడుదలయ్యాయి. అవే ‘వీర సింహారెడ్డి’, వాల్తేర్ వీరయ్య’. ఈ రెండు సినిమాలను భారీ రేట్లకు అమ్మింది మైత్రి సంస్థ. అందరూ రెగ్యులర్ బయ్యర్స్ కావడంతో మైత్రి అడిగినంత మొత్తానికే సినిమాను కొన్నారు. ఆంధ్ర రెండు సినిమాలు కలిపి రూ.70 నుంచి రూ.75 కోట్ల మేరకు కట్టారు. నైజాంలో రూ.33 కోట్లకు అమ్మారు. ఇలాంటి దశలో సినిమాల రిజల్ట్ తేడా వస్తే జీఎస్టీ వెనక్కి ఇవ్వాలన్నా దాదాపు పాతిక కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ తొలి నాలుగు రోజులు, మూడు రోజుల ట్రెండ్ చూస్తుంటే అలాంటి అవసరం లేదని అనిపిస్తోంది. రూ.18 కోట్లకు వైజాగ్ ఏరియా ఇస్తే రెండూ కలిపి ఇప్పటికే రూ.10 కోట్ల వరకు వసూళ్లు సాధించాయి. నైజాం రూ.33 కోట్ల మేరకు ఇస్తే ప్రస్తుతానికి పాతిక కోట్లు వసూలు చేసింది. మిగిలిన ఏరియాల్లో కూడా వసూళ్లు ఇలానే ఉన్నాయి. కాబట్టి కలెక్షన్స్ వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. రెండు సినిమాలు కలిపి ఒకే బయ్యర్ కి ఇవ్వడమనేది ప్లస్ అవుతుంది.
‘వీరసింహారెడ్డి’ సినిమాకి లాంగ్ రన్ ఉండదనే క్లారిటీ వచ్చింది. కానీ ‘వాల్తేర్ వీరయ్య’కి ఉంటుంది. అలా చూసుకుంటే బయ్యర్ సేఫ్ అవుతారు. ఒకవేళ ‘వీరసింహారెడ్డి’ వలన నష్టమొస్తే ‘వాల్తేర్ వీరయ్య’ కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. రెండు సినిమాలు పోటీగా రావడం, ఫ్యాన్స్ మధ్య హడావిడి అన్నీ కలిపి సినిమాలపై విపరీతమైన బజ్ వచ్చేలా చేశాయి. ఆ క్రేజ్ సినిమా ఓపెనింగ్స్ కి బాగా ఉపయోగపడ్డాయి.
ఇక నైజాంలో సొంతంగా సినిమాను రిలీజ్ చేసుకోవడం కూడా మైత్రి వారికి కలిసొచ్చింది. రెండు సినిమాలు కలిపి నైజాంలో నలభై కోట్లకు పైగానే కలెక్ట్ చేస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.