Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?
- February 6, 2026 / 06:03 PM ISTByPhani Kumar
నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) టాలీవుడ్లో ఇప్పుడున్న యంగ్ హీరోల్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరో. వరుసగా 4 హిట్లు కొట్టాడు. మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ ప్లేస్ పై కన్నేశాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ‘జాతి రత్నాలు’ ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ ‘అనగనగా ఒక రాజు’… ఇలా అన్నీ హిట్ సినిమాలే. సినిమా సినిమాకి మార్కెట్ కూడా పెంచుకుంటున్నాడు నవీన్ పోలిశెట్టి.ఇలా నిలకడగా రాణించడం అనేది చిన్న విషయం కాదు. అయితే నవీన్ పోలిశెట్టితో ఓ కంప్లయింట్ ఉంది.
Naveen Polishetty
అదేంటంటే.. అతను వెంటనే సినిమాలు చేయడు. నిర్మాతలకి అడిగిన వెంటనే డేట్స్ ఇవ్వడు. ‘అనగనగా ఒక రాజు’ సినిమా 2021 లో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు. 2025 లో రిలీజ్ అయ్యింది. అంతే కాదు డైరెక్టర్ ఎవరుండాలి అనేది కూడా నవీన్ ఛాయిసే. కాకపోతే టాలెంటెడ్ డైరెక్టర్స్ నే ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. దానికి కూడా మెచ్చుకోవాల్సిందే.స్క్రిప్టులు రాసుకోవడం లేదా.. డైరెక్టర్ తెచ్చిన కథపై రైటింగ్ టీమ్ తో కూర్చొని అతను కూడా వర్క్ చేయడం నవీన్ కి అలవాటు.

అలాగే బడ్జెట్ లెక్కలు వంటివి కూడా పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు. అందుకోసం సాంకేతిక నిపుణులతో కూడా ఎక్కువగా మంతనాలు జరుపుతూ ఉంటాడు.
ఇన్ని స్పెషల్ టాలెంట్లు ఉన్నాయి కాబట్టే.. ఇప్పుడు అతని కోసం పెద్ద నిర్మాతలు కర్చీఫ్ లు వేసే పనిలో పడ్డాయి. ఈ లిస్టులో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ముందున్నట్టు తాజా సమాచారం. నవీన్ ఎర్నేని ఈ మధ్యనే నవీన్ ని కలవడం.. సినిమాకి అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగిపోయిందట. కాకపోతే నవీన్ ఎప్పుడు వాళ్ళకి డేట్స్ ఇచ్చి అందుబాటులోకి వస్తాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు














