Naa Saami Ranga Collections: ‘నా సామి రంగ’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • January 18, 2024 / 01:53 PM IST

అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారుతూ చేసిన మూవీ ‘నా సామి రంగ’. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి క్రేజీ హీరోలు కూడా ఈ మూవీలో నటించడంతో ప్రేక్షకుల దృష్టి ఈ మూవీ పై పడింది. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించగా పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ..ల కి సూపర్ రెస్పాన్స్ లభించాయి. దీంతో అంచనాలు కూడా బాగా పెరిగాయి.

జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  3.86 cr
సీడెడ్  2.65 cr
ఉత్తరాంధ్ర  2.06 cr
ఈస్ట్  1.81 cr
వెస్ట్  0.88 cr
గుంటూరు  1.06 cr
కృష్ణా  0.87 cr
నెల్లూరు  0.63 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  13.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.46 cr
ఓవర్సీస్  0.45 cr
వరల్డ్ వైడ్( టోటల్)  14.73 cr (షేర్)

నా సామి రంగ (Naa Saami Ranga) సినిమాకి రూ.19.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.19.4 కోట్ల షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లో రూ.14.73 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.4.67 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండో వీకెండ్ టైంకి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus