కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో విజయ్ బిన్నీ డైరెక్షన్ లో అషికా రంగనాథ్ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మరో రెండు మూడు రోజుల్లో రిలీజ్ డేట్ గురించి అధికారికంగా క్లారిటీ రానుండగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ కానుంది. సంక్రాంతి సినిమాలలో ఈ సినిమా ఒకింత ఆలస్యంగానే రిలీజ్ కానుండటం గమనార్హం.
అయితే సోగ్గాడే చిన్నినాయన సినిమా కూడా 2016లో సంక్రాంతి పోటీలో చివరిగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నా సామిరంగ సంక్రాంతి పండుగకు సరైన సినిమా అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగిందని సమాచారం అందుతోంది.
అయితే సంక్రాంతి కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయో చూడాల్సి ఉంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో థియేటర్ల కోసం ఊహించని స్థాయిలో పోటీ పెరుగుతోంది. సంక్రాంతి సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.
నాగార్జునకు కెరీర్ పరంగా ప్రస్తుతం భారీ సక్సెస్ అవసరమనే సంగతి తెలిసిందే. బంగార్రాజు తర్వాత సరైన హిట్ లేని నాగ్ నా సామిరంగ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని నమ్ముతున్నారు. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నా సామిరంగ మూవీ సక్సెస్ ఎంతోమందికి కీలకం అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా (Naa Saami Ranga) రాబోయే రోజుల్లో విడుదలై రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!