Naa Sami Ranga: రిలీజ్‌ విషయంలో ఆయన నుండి మాత్రమే క్లారిటీ రావాలి.. ఎప్పుడిస్తారో?

గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్‌ చాలా విచిత్రంగా సాగుతోంది. మేం వచ్చేస్తాం, మేం వచ్చేస్తాం అంటూ సినిమావాళ్లు చెప్పడం, తీరా అసలు సమయానికి వచ్చేసరికి రాకుండా… ముఖం చాటేయడం చూస్తూ ఉన్నాం. ఎందుకు రిలీజ్ చేయరు, అలాంటప్పుడు ఎందుకు వస్తాం అని చెబుతారు అనే డౌట్స్‌ కొన్ని ఉన్నప్పటికీ… ఆ మాటల్ని మనం నమ్ముతూనే ఉన్నాం. తాజాగా 2024 సంక్రాంతి విషయంలోనూ అదే జరుగుతోంది. వచ్చే సంక్రాంతికి వచ్చే సినిమాలు అంటూ ఓ నాలుగైదు రెడీగా ఉన్నాయి.

సినిమా ప్రారంభం అవ్వగానే సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చే పొంగల్‌ ఫైట్స్‌కి సిద్ధంగా ఉన్న సినిమాలు వస్తున్నాయి. అయితే అందరూ సెకండ్‌ కన్ఫర్మేషన్‌ చేసేశారు. దాదాపు ఒక్క హీరో తప్ప. దీంతో అతను మాత్రమే పెండింగ్‌. అతను కూడా చెప్పేస్తేసరి అంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త కనిపిస్తోంది. అతనే నాగార్జున, ఆ సినిమానే ‘నా సామిరంగా’. నాగార్జున 99వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం (Naa Sami Ranga) ‘నా సామిరంగ’. మలయాళం సినిమా ‘పోరంజు మరియం జోస్’కు రీమేక్‌ అని వార్తలొచ్చాయి.

ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు కానీ సినిమా షూటింగ్‌ అయితే శరవేగంగా సాగుతోంది. అయితే టీమ్‌ నుండి ఎలాంటి అప్‌డేట్స్‌ రావడం లేదు. షెడ్యూల్‌ మొదలైంది, మొదలవుతుంది, పూర్తయింది, పూర్తవుతుంది లాంటి ఏ వివరాలూ బయటకు రాలేదు. దీంతో సినిమా సంక్రాంతికి ఉందా? అనే ప్రశ్న కూడా వస్తోంది. ఎందుకంటే 2024 సంక్రాంతి సినిమాల వ్య‌వ‌హారం రంజుగా మారింది.

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ ‘గుంటూరు కారం’, వెంకటేశ్‌ ‘సైంధ‌వ్’, విజయ్‌ దేవరకొండ – పరశురామ్‌ ‘ఫ్యామిలీ స్టార్’, తేజ సజ్జా – ప్రశాంత్‌ వర్మ ‘హ‌ను – మాన్’ ఇప్పటికే రిలీజ్‌ డేట్‌ పోస్టర్లు వదిలేశాయి. కొన్ని అయితే సమాచారం ఇచ్చాయి. కానీ ‘నా సామిరంగా’ నుండి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. దీంతో క్లారిటీ ఇవ్వాల్సిందే నాగ్‌ మాత్రమే అని చర్చలు కనిపిస్తున్నాయి. అయితే టీమ్‌ ప్రస్తుతం షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉందట.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus