అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘నాంది’ ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే హిట్ టాక్ ను రాబట్టుకుంది. 9 ఏళ్లుగా సరైన హిట్టుకోసం ఎదురుచూస్తున్న నరేష్ కు ఈ చిత్రం ఆ లోటుని తీర్చి.. అతన్ని ప్లాపుల నుండీ బయటపడేసింది. విజయ్ కనకమేడల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు. మొదట తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. హిట్ టాక్ సంపాదించుకోవడంతో ఎక్కువ థియేటర్లను కూడా దక్కించుకుంది.
ఇక ఈ చిత్రం 13 డేస్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే :
నైజాం
1.76 cr
సీడెడ్
0.58 cr
ఉత్తరాంధ్ర
0.54 cr
ఈస్ట్
0.39 cr
వెస్ట్
0.28 cr
గుంటూరు
0.39 cr
కృష్ణా
0.42 cr
నెల్లూరు
0.23 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.59 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.10 cr
ఓవర్సీస్
0.17 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
4.86 cr (షేర్)
‘నాంది’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసింది ఈ చిత్రం. ఇక 13 రోజులు పూర్తయ్యేసరికి 4.86 కోట్ల షేర్ ను రాబట్టి డీసెంట్ రన్ కొనసాగిస్తుంది. రెండో బుధవారం నాడు కూడా ఈ చిత్రం 0.09 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే.. 9.05 కోట్ల ను కొల్లగొట్టింది.