9 ఏళ్లుగా సరైన హిట్టు లేక కిందా మీదా పడుతున్నాడు అల్లరి నరేష్. 2012 లో వచ్చిన ‘సుడిగాడు’ తరువాత నరేష్ ఇప్పటివరకూ మరో హిట్ ను అందుకోలేకపోయాడు. ‘జేమ్స్ బాండ్’ ‘సిల్లీ ఫెలోస్’ చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి. ఇక ‘మహర్షి’ చిత్రం హిట్ అయినప్పటికీ అది పూర్తిగా మహేష్ బాబు సినిమా. ఇదిలా ఉండగా.. 2021 ఆరంభంలో అయినా హిట్టు అందుకుంటాడనుకుంటే.. ‘బంగారు బుల్లోడు’ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ఈసారి ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని భావించి.. ఫిబ్రవరి 19న(నిన్న) ‘నాంది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది. ఇక మొదటి రోజు కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 0.18 cr |
సీడెడ్ | 0.06 cr |
ఉత్తరాంధ్ర | 0.06 cr |
ఈస్ట్ | 0.05 cr |
వెస్ట్ | 0.03 cr |
గుంటూరు | 0.04 cr |
కృష్ణా | 0.03 cr |
నెల్లూరు | 0.02 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.47 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.02 cr |
ఓవర్సీస్ | 0.02 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.51 cr |
‘నాంది’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటిి రోజు ఈ సినిమా 0.51 కోట్లలషేర్ ను రాబట్టింది. ఇంకా2.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
Click Here To Read Movie Review
Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!