కామెడీ చిత్రాల హీరోగా ఇమేజ్ ఉన్న అల్లరి నరేష్ పుట్టినరోజున నేడు. ఆ సంధర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ నాంది టీజర్ విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం ఉన్న ఈ టీజర్ సీరియస్ నోట్ లో సాగింది. విచారణలో ఉన్న ముద్దాయిగా అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు. తన కేసు తీర్పు కోసం ఎదురుచూసే అండర్ గోయింగ్ ఖైదీగా అల్లరి నరేష్ పాత్ర ఉందనిపిస్తుంది. ఇక ఖైదీల పట్ల పోలీసుల చిత్ర హింసలు, న్యాయవ్యవస్థలో లోపాలు వంటి విషయాలు ఈ మూవీలో చర్చించినట్లు స్పష్టం అవుతుంది.
ఏళ్ల తరబడి కోర్ట్ తీర్పు కోసం ఎదురుచూసే…ముద్దాయిగా , జైలు గోడల మధ్య చిత్ర హింసలకు గురయ్యే ఖైదీగా ఆయన పాత్ర సీరియస్ అండ్ ఎమోషనల్ గా ఉండే అవకాశం కలదు. ఇక తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ అల్లరి నరేష్ కోసం న్యాయపోరాటం చేసే లాయర్ గా కనిపించే అవకాశం కలదు. ఆమెను కూడా ఈ టీజర్ లో పరిచయం చేయగా సిన్సియర్ అండ్ సీరియస్ లాయర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కమెడియన్ ప్రియదర్శి కూడా జైలులో ఖైదీగా కనిపించాడు.
మరో నటుడు ప్రవీణ్ నాంది మూవీలో ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసినట్లున్నారు. మొత్తంగా నాంది మూవి న్యాయ వ్యవస్థలలోని లోపాలు, ఖైదీల పట్ల పోలీసుల అమానుష ప్రవర్తన వంటి అనేక సామాజిక కోణాలను లోతుగా నాంది మూవీలో చర్చించినట్లున్నారు. మొత్తంగా నాంది టీజర్ సినిమాపై ఆసక్తి రేపేదిగా ఉంది. విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, సతీష్ వేగేశ్న నిర్మించారు.