”ఇక్క‌డి చ‌ట్టాలు చేత‌కానివాడిపై వాడడం కోసమే”

  • February 6, 2021 / 12:01 PM IST

గతంలో ‘నేను’ అనే సీరియస్ తరహా సబ్జెక్ట్ లో నటించిన అల్లరి నరేష్ ఆ తరువాత మొత్తం కూడా కామెడీ సినిమా కథలే ఎన్నుకున్నాడు. ఇన్నాళ్లకు మళ్లీ ఓ సీరియస్ సబ్జెక్ట్ ను ఎన్నుకున్నాడు. అదే ‘నాంది’. విజయ్ కనకమేడల అనే డైరెక్టర్ రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. చేయని నేరానికి ఐదేళ్ల నుండి జైలు శిక్ష అనుభవించే ఓ అమాయకుడు కథే ఈ సినిమా.

రాజగోపాల్ అనే వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ నేరం హీరోపై పడుతుంది. ఐపీసీ సెక్షన్లు, అందులోని లొసుగులు హీరోని మర్డర్ కేసులో ఇరికించేలా చేస్తాయి. ”ఇక్కడి చట్టాలు చేతకానోడిపై వాడడానికి రా.. పవర్ ఉన్నోడిని ఏం పీకలేవు” అని ట్రైలర్ లో వినిపించిన డైలాగ్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేసింది. హీరోని కాపాడాలని ప్రయత్నించే లాయర్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించింది. బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ ఇంటెన్సిటీ ట్రైలర్ ని బాగా ఎలివేట్ చేసింది.

నరేష్ కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోంది. ట్రైలర్ చివర్లో ”అంద‌రూ నా జీవితం ఇక్క‌డితో అయిపోయింది అనుకుంటున్నారు. కాదు… ఇప్పుడే మొద‌లైంది” అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ నెల 19న విడుదల కాబోతున్న ఈ సినిమాతో నరేష్ పూర్వ వైభవం అందుకుంటాడేమో చూడాలి!


జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus