Naatu Naatu Song: ‘ఆర్.ఆర్.ఆర్’ సెకండ్ సాంగ్… పాటతో హీరోల ఆట కూడా అదుర్స్..!

‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్ల హడావిడి మొదలైంది. టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా అదే విధంగా పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని చూడాలని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన హీరోల ఇంట్రో టీజర్లు కానీ, దోస్తీ సాంగ్ కానీ, 45 సెకండ్ల గ్లిమ్ప్స్ కానీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఫస్ట్ సింగిల్ గా విడుదలైన ‘దోస్తీ’ పాట కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక రెండో పాటగా ‘నాటు నాటు’ అంటూ సాగే సాంగ్ ప్రోమోని నవంబర్ 9న విడుదల చేసారు. అయితే అందులో చరణ్, ఎన్టీఆర్ ల డ్యాన్స్ మూమెంట్స్ లేకపోవడంతో వీరి అభిమానులు నిరాశపడ్డారు. కానీ ఈరోజు విడుదల చేసిన ఫుల్ లెంగ్త్ లిరికల్ సాంగ్ లో చరణ్, ఎన్టీఆర్ ల డ్యాన్స్ మూమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కీరవాణి అందించిన ట్యూన్ కానీ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడిన విధానం కానీ హుషారెత్తించే విధంగానే ఉన్నాయి కానీ ఎన్టీఆర్,

చరణ్ ల స్టెప్పుల కోసం రెండు మూడు సార్లు చూసేలా ఉంది ఈ లిరికల్ సాంగ్.ఎన్టీఆర్ కు జోడీగా చేస్తున్న హీరోయిన్ ఒలీవియా మోరిస్ కూడా ఈ పాటలో డ్యాన్స్ చేస్తుండడాన్ని మనం గమనించవచ్చు. చంద్రబోస్ అందించిన లిరిక్స్ కూడా మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి :

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags