Nabha Natesh: ఆ ప్రముఖ నటుడికి వార్నింగ్ ఇచ్చిన నభా నటేష్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా నభా నటేష్ కు నటిగా మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. అయితే ఈ నటి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో ఈ బ్యూటీకి మరీ భారీ రేంజ్ లో ఆఫర్లు అయితే రావడం లేదు. నభా నటేష్ ఎక్స్ లో “హాయ్ డార్లింగ్స్! ఎలా ఉన్నారు” అంటూ పోస్ట్ పెట్టారు. ప్రభాస్ వాయిస్ తో చేసిన రీల్ ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సోషల్ మీడియాలో నభా నటేష్ (Nabha Natesh) షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియో గురించి టాలీవుడ్ నటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda) స్పందిస్తూ “వావ్ సూపర్ డార్లింగ్.. కిర్రాక్ ఉన్నావు” అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ప్రియదర్శి తనను డార్లింగ్ అని పిలవడం గురించి అసహనం వ్యక్తం చేయడంతో పాటు “ఐపీసీ సెక్షన్ 354ఏ ప్రకారం పరిచయం లేని ఒక మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక్ వేధింపులతో సమానం” అనే ఇమేజ్ ను నభా నటేష్ షేర్ చేశారు.

అదే సమయంలో నభా నటేష్ “మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త” అంటూ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. ఆ కామెంట్ కు ప్రియదర్శి స్పందిస్తూ “మనం పరిచయం లేని వ్యక్తులనే విషయం నాకు తెలియదని మీరైతే డార్లింగ్ అనొచ్చు కానీ మేము అంటే సెక్షన్సా? లైట్ తీసుకో డార్లింగ్” అంటూ ప్రియదర్శి రియాక్ట్ అవ్వగా “ఆహా.. హద్దు దాటి ప్రవర్తించకు.. చూసుకుందాం” అంటూ ఆమె సమాధానం ఇచ్చారు.

నభా నటేష్ ప్రియదర్శి సరదాగా అలా చాట్ చేసుకున్నారని కొంతమంది చెబుతుంటే మరి కొందరు వాళ్లిద్దరి మధ్య నిజంగానే గొడవ జరిగిందా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నభా నటేష్ లేదా ప్రియదర్శి స్పందిస్తే మాత్రమే ఈ గొడవ వెనుక అసలు నిజాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. త్వరలో వరుస సినిమాలతో నభా నటేష్ బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus