Nabha Natesh: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన నభా నటేష్..?

ఇప్పటివరకు టాలీవుడ్ లో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాల్లో నటించిన నభా నటేష్ కి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. మరో స్థాయికి వెళ్లే ఛాన్స్ కోసం ఎదురుచూస్తోంది ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వచ్చిందని సమాచారం. ఏకంగా స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం ఆమెకి వచ్చిందట. అయితే ఇది సినిమా కాదట. వెబ్ సిరీస్ అని తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో ఓటీటీల హవా పెరగడంతో సినీ తారలు వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరూ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ‘సేక్రెడ్ గేమ్స్’లో నటించగా.. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ మొదలైంది. ఇప్పుడు హృతిక్ రోషన్ హీరోగా ఓ సిరీస్ తెరకెక్కబోతుంది. హాలీవుడ్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ ఆధారంగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ వెబ్ సిరీస్ ను రూపొందించబోతున్నట్లు సమాచారం.

హృతిక్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటించనుందని టాక్. హృతిక్ లాంటి స్టార్ హీరో ప్రాజెక్ట్ లో నభాకు ఆఫర్ రావడం మాములు విషయం కాదు. ఈ సిరీస్ గనుక క్లిక్ అయితే ఆమెకి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus