Nag Ashwin: ‘కల్కి 2898 ad’… ఇప్పటికీ.. జాగ్రత్త పడకపోతే కష్టం నాగ్ అశ్విన్..?

భారీ బడ్జెట్ సినిమా తీసేస్తే సరిపోదు. దానిని కరెక్ట్ గా జనాల్లోకి తీసుకెళ్లడం కూడా తెలియాలి. ఆ విషయంలో రాజమౌళి (Rajamouli) దిట్ట. ఆయన ‘బాహుబలి’ (Baahubali) తీసినప్పుడు రూ.125 కోట్ల బడ్జెట్ పెట్టించాడు అంటే చాలా మంది విమర్శించారు. ‘తెలుగు సినిమాకి అంత స్టామినా లేదు అని? ప్రభాస్ వంటి రూ.40 కోట్ల హీరోతో అంత మొత్తం ఎలా రికవరీ చేస్తాడని..?’.. ఇలా రకరకాల విమర్శలు తలెత్తాయి. కానీ రాజమౌళి.. ఆ సినిమా స్పాన్ కి తగ్గట్టు ప్రమోషన్స్ కూడా బాగా ప్లాన్ చేశాడు.

‘బాహుబలి 2 ‘ (Baahubali 2) ‘ఆర్.ఆర్.ఆర్'(RRR) ..లకు అది ఇంకా కలిసొచ్చింది. ఏ రాష్ట్రంలోని ప్రేక్షకుల్ని తక్కువ చేసి చూడలేదు రాజమౌళి. తెలుగులో ఎంతలా ప్రమోషన్ చేశాడో తమిళనాడు, కేరళ, ముంబై వంటి ప్రదేశాల్లో కూడా అదే విధంగా ప్రమోషన్ చేశాడు. అయితే రాజమౌళి బాటలో పెద్ద బడ్జెట్ సినిమాలు చేసే మేకర్స్ మాత్రం అతని స్థాయిలో తమ సినిమాను ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు. లేటెస్ట్ ఎగ్జామ్పుల్ నాగ్ అశ్విన్ ని  (Nag Ashwin)  చెప్పుకోవచ్చు.

‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD)  అనే పాన్ ఇండియా సినిమాని తీసిన అతను.. ప్రమోషన్స్ ను సరిగ్గా ప్లాన్ చేయలేదు. ‘కల్కి..’ కథ పై కూడా జనాల్లో ఓ క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే మేకర్స్ ఈ సినిమాని ప్రమోషన్ చేయట్లేదు. సరే అన్నీ ఎలా ఉన్నా.. రాజమౌళి తన సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ముందే.. కథ ఏంటి? అనేది ప్రేక్షకులకి చెప్పేసి ప్రిపేర్ చేసి ఉంచుతాడు.

అలాగే ప్రతి పాత్రని పరిచయం చేస్తూ వీడియోలు వదులుతాడు. అప్పుడు జనాలు ఓ క్లారిటీతో థియేటర్ కి వెళ్తారు.కథ పై వంకలు పెట్టకుండా.. ఆ టేకింగ్ ని ఎంజాయ్ చేస్తారు. కానీ నాగ్ అశ్విన్ … ‘కల్కి..’ కథ గురించి సరైన వివరణ ఇచ్చింది. వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. అందులో అతను మాట్లాడే తీరు కూడా అందరూ అటెన్షన్ పే చేసేలా లేదు.

వీకెండ్ వరకు క్లాస్ ఆడియన్స్ మల్టీప్లెక్సుల్లో సినిమాని చూస్తారు. అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల మంచి ఓపెనింగ్స్ రావచ్చు. కానీ 4 వ రోజు నుండి సినిమాని ఆదుకునేది బి,సి సెంటర్ ఆడియన్స్. వాళ్ళు సరైన విధంగా ప్రిపేర్ అయ్యి థియేటర్ కి వెళ్లకపోతే… ఫలితం తేడా కొట్టేసే ప్రమాదం ఉంది. ఆ డ్యామేజ్ జరగకముందే నాగ్ అశ్విన్ జాగ్రత్త పెడతాడేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus