కొణిదెల నాగబాబు.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకు సోదరుడు . మంచి ఒడ్డు పొడుగు హీరో కటౌట్ ఉన్నప్పటికీ నాగబాబు కథానాయకుడిగా మారలేకపోయారు. కానీ నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్టుడిగా, తన సోదరులపై ఈగ వాలనివ్వని వ్యక్తిగా ఆయన మెగా ఫ్యాన్స్ అభిమానాన్ని చూరగొన్నారు. ప్రొడ్యూసర్ గా ఓ రేంజ్ లో ఉండగా తగిలిన కొన్ని ఎదురుదెబ్బలతో కొంతకాలం సైలెంట్ గా ఉన్నప్పటికీ.. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోకి జడ్జిగా నాగబాబు తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చారు.
మధ్యలో కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ మళ్లీ ఫాంలోకి వచ్చేశారు. అన్నయ్య చిరంజీవిని దేవుడిలా ఆరాధించే నాగబాబులో మంచి విమర్శకుడు కూడా దాగున్నాడు. నచ్చని విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పడం ఆయన స్టైల్. సినిమాల్లో చిరంజీవి చేసే ఫైట్ల విషయంలో నాగబాబుకు ఎక్కడా లేని కోపం వచ్చేస్తుంది. అన్నయ్యతో గొడవకు సైతం ఆయన వెనుకాడరు. బ్రదర్ ని వారించడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు. ఒక సినిమా కోసం హోటల్ అట్లాంటిక్ పై భాగాన మూడున్నర అడుగుల వెడల్పు ఉన్న చిన్న పిట్ట గోడపై ఫైట్ ..
దీనిని చూసి నాగబాబుకు భయం వేసింది. అన్నయ్యని వారించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో షూటింగ్ చూడలేక ఇంటికి వెళ్ళిపోయారు నాగబాబు. ఇక సొంత బ్యానర్ లో తీసిన ‘త్రినేత్రుడు’ చిత్రంలోని గ్లోబ్ ఫైట్ ను నిర్మాత అయ్యుండి కూడా నాగబాబు అడ్డుకోలేకపోయారు. దానిని అప్పట్లోనే ఆరు రోజుల పాటు తీశామని.. ఆయన ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పారు. అంత రిస్క్ ఫైట్ ని తెలుగు హీరోల్లో ఏ ఒక్కరూ చేయలేరని అంటారు.
చిరు శరీరాన్ని జాగ్రత్తగా గమనిస్తే షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాల తాలూకు గాయాల మచ్చలు కనిపిస్తాయి. అయితే అదృష్టవశాత్తూ చిరంజీవికి ఎలాంటి పెద్ద ప్రమాదం జరక్కపోవడం. కానీ అంత రిస్కీ ఫైట్స్ చేసినా ఏం కాలేదు కానీ.. ‘సంఘర్షణ’ సినిమాలో చిన్న ఫైట్ కి మెగాస్టార్ కి దెబ్బ తగిలిందట. అప్పటి నుంచి బయటి సినిమాలు ఏమైనప్పటికీ.. అంజనా ప్రొడక్షన్స్ లో అయినా రిస్క్ ఫైట్స్ పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు నాగబాబు ఒకానొక సందర్భంలో చెప్పారు.