Naga Babu: రెండో పెళ్లిపై నాగబాబు కామెంట్లు.. విమర్శిస్తున్న నెటిజన్లు..?

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలను ఇస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది కూతురు నిహారిక వివాహం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నాగబాబు త్వరలో వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేయాలని భావిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఇప్పటికే పెళ్లికూతురును వెతికే ప్రక్రియ మొదలైందని తెలుస్తోంది.

అయితే ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్ లో ఒక నెటిజన్ సరదాగా సార్ మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? అనే ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు నాగబాబు చమత్కారంగా ఈ వయస్సులో నాకు పెళ్లా..? మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే..? అంటూ బదులిచ్చారు. నాగబాబు చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆ కామెంట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగబాబు సరదా కోసమే అలా చెప్పారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతుంటే మరి కొందరు నెటిజన్లు మాత్రం నాగబాబు కామెంట్ పై విమర్శలు చేస్తున్నారు.

తమ్ముడి బాటలోనే మీరు కూడా నడుస్తారా..? అంటూ కొంతమంది నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉన్న నాగబాబు సినిమా ఆఫర్లతో మాత్రం బిజీగానే ఉన్నారని తెలుస్తోంది. ఛత్రపతి బాలీవుడ్ లో రీమేక్ అవుతుండగా ఆ సినిమా బాలీవుడ్ లో సక్సెస్ అయితే మాత్రం ఇకపై నాగబాబు విలన్ రోల్స్ లో కూడా నటించే అవకాశాలు ఉంటాయి. జబర్దస్త్, అదిరింది షోలకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు భవిష్యత్తులో మళ్లీ టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus