Naga Babu: ఆ ఫేక్ పోస్ట్ వల్లే నాగబాబు హర్ట్ అయ్యారా.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) గంగోత్రి (Gangotri) సినిమా నుంచి పుష్ప ది రైజ్ (Pushpa) వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో బన్నీ ఒకరు. బన్నీ సినీ కెరీర్ లో వివాదాలు కూడా చాలా తక్కువనే సంగతి తెలిసిందే. అయితే నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ చేసి అల్లు అర్జున్ వార్తల్లో నిలిచారు.

బన్నీ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో నాగబాబు (Naga Babu) సోషల్ మీడియా వేదికగా బన్నీని టార్గెట్ చేస్తూ మావాడైనా పరాయివాడే అంటూ చేసిన ట్వీట్ సంచలనం అయింది. నాగబాబు ఈ కామెంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన నిమిషం నుంచి బన్నీ ఫ్యాన్స్ నాగబాబును టార్గెట్ చేస్తూ ఇష్టానుసారం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టడం జరిగింది. మరోవైపు అల్లు అర్జున్ నాగబాబును కించపరిచేలా కామెంట్ చేసినట్టు ఒక పోస్ట్ ను ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేశారు.

ఆ ఫేక్ పోస్ట్ మరీ దారుణంగా ఉండటం వల్లే నాగబాబు ట్విట్టర్ ను తాత్కాలికంగా డీ యాక్టివేట్ చేశారని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే నాగబాబు ట్విట్టర్ ను యాక్టివేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని భోగట్టా. అల్లు అర్జున్ మౌనంగా ఉండటం వల్ల కూడా చాలా ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పుష్ప2 (Pushpa2) వాయిదా పడనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పుష్ప ది రూల్ వాయిదా వార్తలకు సంబంధించి అధికారికంగా మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. పుష్ప ది రూల్ పాన్ ఇండియా మూవీ కావడంతో వాయిదా పడే ఛాన్స్ అయితే లేదని మేకర్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. త్వరలో ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది. పుష్ప ది రూల్ రిలీజ్ సమయానికి మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య గ్యాప్ తగ్గాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus