Naga Babu: చరణ్‌ అలాంటోడు.. పవన్‌ కోసం ఈ పని చేయండి: నాగబాబు

పవన్‌ కల్యాణ్‌ ఫంక్షన్‌ అవ్వనీయండి, రాజకీయ సభ అవ్వనీయండి… అంతెందుకు మెగా ఫ్యామిలీలో ఎవరి ఫంక్షన్‌ అయినా.. కామన్‌గా వినిపించే స్లోగన్‌లు రెండు ఉంటాయి. ఒకటి పవర్‌ స్టార్‌ అయితే, రెండో సీఎం పవర్‌ స్టార్‌. చాలా ఏళ్లుగా ఈ మాటలు వింటూనే ఉన్నాం. వీటికి మెగా బ్రదర్‌ నాగబాబు సమాధానం ఇస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు మందలిస్తూ, కొన్నిసార్లు కోప్పడుతూ ఆయన అభిమానులకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా మరోసారి అభిమానుల నుండి సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. దానికి నాగబాబు బలంగా సమాధానం ఇచ్చారు.

సీఎం అంటూ నినాదం చేస్తే సరిపోదని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు నాగబాబు క్లాస్‌ పీకారు. మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో చరణ్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకకు అతిథిగా వచ్చిన నాగబాబు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం.. సీఎం’ అంటూ పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ అభిమానులు, జనసేన కార్యకర్తలు నినాదాలు చేయడంపై నాగబాబు  స్పందించారు.

‘‘సీఎం.. సీఎం’ అని అరిస్తే సరిపోదు.. ఆయనకు, ఆయన పార్టీకి ఓట్లు వేయాలి’ అని నాగబాబు (Naga Babu) అన్నాడు. అంతేకాదు ఇదే మాట ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ చాలా సార్లు చెప్పాడు అని గుర్తు చేశారు కూడా. సీఎం అంటూ నినాదాలు చేయడం మాత్రమే కాదు.. ఆ మేరకు ప్రజలను మోటివేట్‌ చేయండి. అదే పవన్‌ కల్యాణ్‌కు మనం ఇచ్చే గొప్ప బహుమతి అని జనసైనికులకు నాగబాబు పిలుపునిచ్చారు. అయితే దీనిపై కొంతమంది నుండి విమర్శలు వస్తున్నాయి. అంత కోపం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

మా తోబుట్టువులకు అన్నయ్య చిరంజీవి ఎలాగో.. మా పిల్లలకు చరణ్‌ అంతే. చరణ్‌ చిన్నప్పుడు అమాయకంగా ఉండేవాడు. యుక్త వయసులో కోపంగా, ఎమోషనల్‌గా ఉండేవాడు. తర్వాత మెచ్యూరిటీతో సాఫ్ట్‌గా మారాడు. ప్రతి ఇంటికి ఇలాంటి కొడుకు ఉంటే బావుణ్ను అని అనుకునేలా చేస్తున్నాడు. మా కుటుంబంలో పిల్లలకు ఏదైనా సమస్య వస్తే… చరణ్‌ దగ్గరకే వెళ్తారు అని చెప్పారు నాగబాబు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus