టాలీవుడ్‌లో సాధారణంగా స్టార్ హీరోల వ్యక్తిగత జీవితం కూడా భారీ చర్చలకు దారితీయడం సహజం. అయితే నాగ చైతన్య (Naga Chaitanya) మాత్రం ఎప్పుడూ సింపుల్ జీవితం మెచ్చుకునేలా తనదైన స్టైల్‌లో కొనసాగుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో తన భార్య శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) సినిమాల విషయంలో ఇచ్చిన సమాధానం ఈ విషయం మరోసారి నిరూపించింది. ప్రేమ అనేది గౌరవం, స్వేచ్ఛల మీద ఉండాలని చైతూ తెలిపాడు. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
చైతన్య, శోభిత ప్రేమలో మునిగి రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ కెరీర్‌లను సంపూర్ణ స్వేచ్ఛతో కొనసాగిస్తున్నారు. చైతూ మాట్లాడుతూ, “శోభిత ఏ సినిమాలు చేస్తుందో ఆమె స్వతంత్ర నిర్ణయం. నేను ఎప్పుడూ ఆ విషయంలో జోక్యం చేసుకోను,” అంటూ క్లియర్‌గా చెప్పేశాడు. ఈ మాటలు విన్న నెటిజన్లు, “ఇది నిజమైన ప్రేమకు ప్రతిబింబం” అంటూ చైతూ వ్యవహారాన్ని కొనియాడుతున్నారు.
శోభిత ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో మంచి గుర్తింపు సంపాదించింది. నటిగా తనదైన గుర్తింపును తెచ్చుకుంది. బాలీవుడ్‌లోనూ తన క్రాఫ్ట్‌తో ఆకట్టుకుంటోంది. అలాంటి సమయంలో భర్తగా చైతూ ఇచ్చిన పూర్తి మద్దతు శోభిత కెరీర్‌ను మరింత ముందుకు నడిపించడానికి బలమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి మధ్య ఉన్న పరస్పర గౌరవం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక సినిమాల పరంగా చూస్తే, చైతూ ‘తండేల్’ (Thandel) విజయంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. నెక్స్ట్ కార్తిక్ దర్శకత్వంలో ‘ఎన్‌సీ24’ అనే అడ్వెంచర్ థ్రిల్లర్ కోసం సిద్ధమవుతున్నాడు. మేకింగ్ గ్లింప్స్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు పెరిగాయి. నటనపరంగా కొత్త ఛాలెంజ్ తీసుకోవడమే కాకుండా, తన వ్యక్తిగత జీవితాన్నీ అందరికి ఆదర్శంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు చైతూ.