Naga Chaitanya: దళపతి విజయ్‌ గురించి మాట్లాడిన చైతు.. వీడియో వైరల్‌

Ad not loaded.

విజయ్‌ (Vijay Thalapathy)  పేరుకే కోలీవుడ్‌ హీరో.. కానీ టాలీవుడ్‌కి కూడా ఆయన సుపరిచితం. ఇప్పుడంటే పాన్‌ ఇండియా కాన్సెప్ట్‌లో అందరూ మనవాళ్లే అనుకుంటున్నాం కానీ. ఒకప్పుడు కూడా విజయ్‌ అలాంటోడే. విజయ్‌ సినిమా వస్తోంది అంటే.. మన దగ్గర కూడా చిన్నపాటి స్పందన వచ్చే రోజుల నుండి.. భారీ స్పందన వచ్చే రోజులు చూశాం. తాజాగా ఇదే విషయాన్ని యువ స్టార్‌ హీరో నాగచైతన్య (Naga Chaitanya)  కూడా చెప్పాడు. రీసౌండ్‌ అంటూ అదిరిపోయే కామెంట్‌ చేశాడు.

Naga Chaitanya

ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌ కోసం నాగచైతన్య తమిళనాడడు వెళ్లాడుడ. అక్కడ ఆయన స్టేజీ మీదకి రాగానే ‘ది గోట్: గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’  (The GOAT)  సినిమా పోస్టర్ స్క్రీన్ మీద వేసి దీని గురించి ఏమంటారు అని యాంకర్ అడిగారు. ‘‘కస్టడీ’ సినిమా షూటింగ్ సమయంలో ‘ది గోట్’ సినిమా స్టోరీ లైన్ గురించి వెంకట్ ప్రభు చెప్పారు. విజయ్ ఫ్యాన్స్‌కి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. విజయ్ సినిమా హిట్‌ అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు.

తమిళనాడు నుంచి ఆంధ్ర వరకూ రీసౌండ్ వస్తుంది అని చైతు చెప్పాడు. ఆ వీడియోను చైతూ ఫ్యాన్స్ ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌)లో పోస్ట్ చేయగా విజయ్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. విజయ్‌ సత్తా ఇదీ అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక చైతు సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం చందు మొండేటి ‘తండేల్’ (Thandel)  అనే సినిమాలో నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ నిర్మిస్తోంది.

ఈ సినిమాలో చైతన్య.. రాజు అనే మత్స్యకారుడిగా కనిపించనున్నాడు. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ సినిమాలో ప్రేమ అంతర్లీనంగా ఉంటుంది. ఇక విజయ్‌ సినిమా సంగతి చూస్తే.. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

చిరంజీవి మాట వినకుండా చరణ్ నటించిన సినిమా ఏదో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus