Ram Charan: చిరంజీవి మాట వినకుండా చరణ్ నటించిన సినిమా ఏదో తెలుసా?

స్టార్ హీరో రామ్ చరణ్  (Ram Charan) హీరోగా నటించిన సినిమాలలో ఫ్లాప్ సినిమాలు తక్కువేననే సంగతి తెలిసిందే. అయితే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేశాయి. అలా మెగా ఫ్యాన్స్ ను మెప్పించని సినిమాలలో జంజీర్ (Zanjeer) సినిమా కూడా ఒకటి. తెలుగులో తుఫాన్ అనే టైటిల్ తో ఈ సినిమా విడుదల కాగా ఈ సినిమా విషయంలో చరణ్ పై కొన్ని విమర్శలు సైతం వచ్చాయి. అయితే చిరంజీవి (Chiranjeevi)  మాట వినకుండా చరణ్ ఈ సినిమాలో నటించారట.

Ram Charan

ఈ సినిమాతో చరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇవ్వడం సరికాదని చిరంజీవి భావించారట.అయితే చరణ్ కు మాత్రం కథ నచ్చడం చరణ్ ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి ఆసక్తి చూపించడంతో చిరంజీవి కొడుకు ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం అందుతోంది. జంజీర్  చరణ్ సినీ కెరీర్ లో భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా తర్వాత చరణ్ బాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమాలలో నటించలేదు.

ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలు మాత్రం పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చరణ్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తే మరిన్ని విజయాలు చరణ్ ఖాతాలో చేరే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండగా గేమ్ ఛేంజర్ (Game changer)  సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండనున్నాయని ఈ సినిమాలో మెసేజ్ కూడా అద్భుతంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. శంకర్ (Shankar) రామ్ చరణ్ ను ఏ రేంజ్ లో చూపించారో తెలియాలంటే మాత్రం మరికొన్ని నెలలు ఆగాల్సిందే. కియారా (Kiara Advani) , అంజలిలకు (Anjali) కూడా ఈ సినిమా సక్సెస్ కీలకమనే సంగతి తెలిసిందే.

నేషనల్ అవార్డు కొట్టిన ‘ఆట్టం’ గురించి ఈ విషయాలు మీకు తేలుసా?

‘దేవర’ నుండి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus