అక్కినేని హీరో నాగచైతన్య కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలలో నటిస్తున్న నాగచైతన్య చందూ మొండేటి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న చైతన్య బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం అందుతోంది. నాగార్జునకు ఇప్పటికే చాలా వ్యాపారాలు ఉండగా నాగచైతన్య కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. స్టార్ హిరో నాగచైతన్యకు కార్లు, బైక్స్ అంటే ఇష్టం కాగా పలు సందర్భాల్లో ఈ విషయాలను స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజాగా రేసింగ్ గేమ్స్ లో సందడి చేసిన చైతన్య ప్రస్తుతం మోటార్ రేసింగ్ గేమ్ లో భాగమయ్యారు. హైదరాబాద్ బ్లాక్ బర్ట్స్ రేసింగ్ టీమ్ ను నాగచైతన్య కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. నీల్ జానీ, అఖిల్ రవీంద్ర ఈ టీమ్ కు డ్రైవర్లుగా ఉన్నారు. బ్లాక్ బర్ట్స్ రేసింగ్ టీమ్ ను కొనుగోలు చేయడం గురించి చైతన్య స్పందిస్తూ ఈ రేసింగ్ టీమ్ కొనుగోలు ద్వారా నా కల తీరిందని తెలిపారు.
చాలా రోజుల నుంచి మోటర్ స్పోర్ట్స్ లో భాగం కావాలని భావిస్తున్నానని ఆ కలను ఈ విధంగా నెరవేర్చుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. బ్లాక్ బర్ట్స్ టీమ్ లో భాగం కావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని నాగచైతన్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రేస్ లు గొప్ప వినోదాన్ని ఇస్తాయని చైతన్య కామెంట్లు చేయడం గమనార్హం.
ఫార్ములా4 ఇండియన్ ఛాంపియన్ షిప్ లో చై టీమ్ పోటీ చేయనుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఏడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతన్య తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. నాగచైతన్య (Naga Chaitanya) రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.